Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

26 వేల మంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించాం…

Mahender-Reddy

హైదరాబాద్: ఆర్‌టిసి ఉద్యోగుల ఆరోగ్యం, వైద్యసేవలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం రూ.48 కోట్లతో 56 వేల మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. 26 వేల మంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో విధి నిర్వహణలో మృతి చెందిన డ్రైవర్లు ముగ్గురే ఉన్నారని వెల్లడించారు. తార్నాకలోని 200 పడకలు, కరీంనగర్‌లో 12 పడకల ఆస్పత్రుల ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మరో 15 డిస్పెన్సరీల ద్వారా ఆర్‌టిసి కార్మికులకు వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. క్యాన్సర్, గుండె జబ్బులకు వైద్య సేవలనూ అందిస్తున్నామని, కార్మికులు, సిబ్బంది కుటుంబాలకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.

Comments

comments