Search
Tuesday 20 November 2018
  • :
  • :

ట్రెండ్ మారినా… ఫ్రెండు మారడంటున్న రామ్

Ram's-Vunnadhi-Okate-Zindag

యంగ్ హీరో రామ్‌ను సరికొత్తగా ఆవిష్కరించిన ‘నేను శైలజ’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్ కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీగా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్‌లో మరో సినిమా నిర్మాణంలో ఉంది. స్రవంతి రవికిశోర్, పి.ఆర్.సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కృష్ణచైతన్య నిర్మిస్తున్నారు.

ఇందులో అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి కథానాయికలు. ఈ చిత్రానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ‘ఫ్రెండ్ షిప్ డే’ సందర్భంగా మూవీలోని ఓ పాటను విడుదల చేశారు. ‘ట్రెండ్ మారినా… ఫ్రెండు మారడంటూ’ సాగే ఈ సాంగ్ చాలా బాగుంది. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నాడు.

Comments

comments