Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నల్లమల గిరిజనుల అభివృద్ధికి చర్యలు

చెంచులకు హాబిటేషన్‌పై హక్కులు కల్పిస్తాం
గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి జిడి అరుణ

mbnr2అచ్చంపేట: నల్లమల గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జిడి అరుణ అ న్నారు. సోమవారం జిల్లాలోని నల్లమల అ చ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండ లంలోని కోమ్మెన్ పెంట, కొల్లంపెంట, మ ల్లాపూర్ పెంటలను ఆమె సందర్శించారు. అ నంతరం మన్ననూర్‌లోని జిల్లా మాడా కా ర్యాలయంలో ఆమె స్థానిక విలేఖరులతో మా ట్లాడారు. నల్లమలలోని అటవీ ప్రాంతంలోని కోమ్మెనపెంటలో చెంచులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముచ్చటించారు.చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె స్వయంగా పరిశీలించారు వాటిపై సందేహలను ఇక్కడి చెంచులను అడిగి తెలుసుకున్నారు. చెంచుల కోసం ఏర్పాటు చేసిన సామూహిక మేకల పెం పకం కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.15 కు టుంబాలకు కలిపి ఒక్క రికి 10మేకల చొప్పున 150 మేకలను చెంచులకు పంపిణి చేశారు. వారి స్థితి గతులపై వారిని అడిగి తెలుసుకు న్నారు.పెంటలలో నివసిస్తున్న చెంచులకు ఉ పాధి అవకాశాలను గురించి ఐకెపి సిఇఓ ము రళి,ఐటిడిఎ పిఓ డాక్టర్ నవిన్ నికోలస్ లను అడిగి తెలుసుకున్నారు.
గ్రామీణ ఉపాధి హామి ద్వారా చెంచులకు పని కల్పిస్తున్నామని వారు సమాధాన మిచ్చారు. అర్హులైన చెంచులందరికి రేషన్ కార్డు,పింఛన్లు అందే విధంగా చూడాలని అధికారులను అదే శించారు. కోమ్మెన్‌పెంట నుంచి జంగం రెడ్డి పల్లి వెళ్ళి పింఛన్లు తీసుకొవడానికి ఇబ్బందిగా వుందని కొరగా కొమ్మన్ పెంట గ్రామైక్య సం ఘం ద్వారా పింఛన్లు ఇప్పించెందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలసాయం ద్వారా చెం చులు పొందుతున్న ఉపాధి అవకాశాల గురిం చి జిసిసి మేనేజర్ చందర్‌లాల్ ను అడిగి తెలు సుకున్నారు.తేనే,జిగురు ఇతర సరుకులు సేక రించి చెంచులు ఉపాధి పొందుతున్నారని ఆయన సమాదానమిచ్చారు.
రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతానికి వెళ్ళి తీసుకునేందుకు రవాణా సౌకర్యం కల్పిం చాలని చెంచులు గిరిజన రాష్ట్ర సంక్షేమ కా ర్యదర్శితో విన్నవించారు. చిన్నారులకు విద్య నందించే ందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన బాలబడి కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. చెంచు పెంటల్లో నివసిస్తున్న చెంచులందరికి హబిటేషన్‌పై హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకొవాలని ఆమె అదికారులను ఆదేశించా రు. మన్నననూర్ మడా కార్యాలయంలొ నూ తన దంపతులకు కల్యాణలక్ష్మిఆధువీకరణ పత్రాలను అందజేశారు.
అనతంరం ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ఇంచార్జి పిడి వెంకటయ్యగౌడ్, డిటిడబ్లూఓ ఉపేంద్రచారి, ఐటిడిఎ, మాడా మేనేజర్ మహ మ్మద్ జాఫర్,ఎటి డబ్లూఓ ప్రత్యుష్య, చెం చులు, నాయకులు ,వివిధ ,పెంటల చెంచులు పాల్గొన్నారు.

Comments

comments