Home తాజా వార్తలు మెడిసిన్‌లో ర్యాంకు కైవసం చేసుకున్న గిరిజన విద్యార్థిని..

మెడిసిన్‌లో ర్యాంకు కైవసం చేసుకున్న గిరిజన విద్యార్థిని..

విద్యార్థినిని అభినందించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి..

 

మన తెలంగాణ/ఖిల్లా ఘణపురం: వనపర్తి జిల్లాలో ఘణపురం మండల పరిధిలోని రుక్కన్నపల్లి తాండాకు చెందిన మన్యానాయక్, దేవీ దంపతుల కుమార్తె భారతి మెడిసిన్‌లో ర్యాంకు కైవసం చేసుకుంది. భారతి ఆత్మస్తైర్యంతో ముందుకు వెళ్తుంది. ఉన్నత చదువుకు పేదరికం అడ్డుపడకుండా చదువును కొనసాగిస్తుంది. ఇటీవల భారతిని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతిలు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భారతి సోమవారం మన తెలంగాణతో మాట్లాడుతూ హైద్రాబాద్‌లోని మెడ్‌సిటి మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్‌లో చేరానని తెలిపారు. ఆర్థిక పరిస్థితి, ఇతరుల ప్రోత్సాహం, ఏ మాత్రం తనకు అందడం లేదన్నారు. కుటుంబ పరిస్థితులు ఉన్నత చదువుకు అడ్డంగా మారాయని తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ సహాయం అందించి తన ఉన్నత చదువుకు ప్రోత్సాహం అంద జేయాలని ఆమె కోరారు. తల్లి సంపాదనపై కుటుంబం గడవడం లేదని తన తమ్ముడు శివకుమార్ కూడా రాజేంద్రనగర్‌లో జూనియర్ కళాశాలలో బైపిసిలో 978 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులు సాధించినట్లు ఆమె తెలిపారు. ఇటీవల తన తండ్రి ఆస్పత్రి పాలు కావడంతో వైద్య ఖర్చులు, ఇటు కళాశాల ఫీజులు, తమ తమ్ముడు శివకుమార్‌కు అయ్యే ఫీజుల భారాన్ని తమ కుటుంబం భరించలేకపోతుందని ఆపదలో ఉన్న తమ కుటుంబానికి భరోసా కల్పించాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఆదుకోవాలని భారతి, శివకుమార్‌లు కోరారు.

 

Tribal Student Got in Medicine Rank in Hyderabad