Search
Saturday 17 November 2018
  • :
  • :

టిఎస్‌పిిఇసెట్‌లో మెరిసిన గిరిజన విద్యార్థులు…

Tribles

కామారెడ్డి: ఇటీవల కాలంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్ టెస్ట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బాన్సువాడ మండలంలోని తిర్మాలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తబాది తండాకు చెందిన గిరిజన విద్యార్థలు ఎం. మమత రాష్ట్రస్థాయిలో 30వ ర్యాంకు, కె. భాస్కర్ 116వ ర్యాంకు సాధించారు. వీరు ఇద్దరు పస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కొత్తాబాది ఉన్నత పాఠశాలలో చదివారు. మమత, భాస్కర్‌లు ఈ మధ్యకాంలో ఇంటర్ పూర్తి చేసుకొని టిఎస్‌పిఇసెట్ ఎంట్రన్ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పిఇటి సురేందర్ ఇచ్చిన సూచనలు పాటిస్తూ పోటీ పరీక్షలో విజయం సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో 30వ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. తనను ప్రోత్సాహించిన అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు రుణపడి ఉంటానని మమత చెప్పింది.  రాష్ట్రస్థాయిలో ర్యాంకు రావడంపై విద్యార్థులను గ్రామస్తులందరూ అభినందనలు తెలిపారు.

Comments

comments