Home ఆదిలాబాద్ జ్వరంతో కోలాం గిరిజన బాలింత మృతి

జ్వరంతో కోలాం గిరిజన బాలింత మృతి

Tribal women death with fever

 

ఇద్రవెల్లి:  రక్త హీనత, జ్వరంతో బాలింత మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలోని లిమ్‌గూడలో చోటు చేసుకుంది. కుటుంబికులు తెలిపిన వివరాల ప్రకారం… బేల మండలంలోని దుబ్బగూడ కోలాం గిరిజన గ్రామానికి చెందిన మడావి రుఖ్మబాయి(36) గత 28 రోజుల క్రితం ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రసూతి అయింది. రుఖ్మబాయి ముందు నుండే రక్తహినతతో బాదపడుతుంది. ప్రసూతి అయిన అనంతరం జ్వరంతో పాటు అనారోగ్యానికి గురి కాగా కుటుంబికులు గత వారం రోజుల క్రితం మళ్లి రిమ్స్ ఆస్పత్రికి తీసుకు వెళ్లి వైద్య పరిక్షలు నిర్వహించి రక్తం ఎక్కించారు. రెండు రోజుల పాటు రిమ్స్‌లో వైద్యం అందించి ఇంటికి పంపించగా రుఖ్మబాయిని తమ కుటుంబికులు రెండు రోజుల క్రితం ఇంద్రవెల్లి మండలంలోని లిమ్‌గూడలో ఉంటున్న తమ బందువుల వద్దకు తీసుకోచ్చారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం లిమ్‌గూడలోనే మృతి చెందినట్టు తెలిపారు. మృత్యురాలు రుఖ్మబాయికి భర్త భీంరావ్‌తో పాటు 28 రోజుల పాప కుడా ఉంది. రుఖ్మబాయి మృతదేహన్ని అంతక్రియం నిమ్మితం బేల మండలంలోని దుబ్బగూడకు తరలించినట్టు తెలిపారు.

Tribal women death with fever in Indravelli

Telangana Latest News