Home రంగారెడ్డి గిరిజనులుగా పుట్టడమే పాపమా…

గిరిజనులుగా పుట్టడమే పాపమా…

protest with empty pots
మంచాల: గుక్కేడు మంచి నీటి కోసం తెల్లారిందంటే బిందెలు చేత పట్టుకొని వ్యవసాయ పోలాల వెంట పరుగులు తీయాల్సిందె. కనీసం నెల రోజులుగా త్రాగటానికి మంచి నీళ్లు లేక పోవడంతో అందులో ప్రజా ప్రతి నిధులు మండల అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో శుక్రవారం ఉదయం గిరిజనులు ఖాళీ బిందెలతో రోడ్డు పైకి వచ్చారు. మూడు గంటల పాటు ధర్న, రాస్థారోక్కోకు దిగారు. వివరాల్లోకి వెళ్లితే… మంచాల మండల పరిధిలోని లోయపల్లి అనుబంధ గ్రామాలు ఆంబోత్‌ తండా, సత్తి తండాలలో త్రాగు నీరు లేక నెల రోజులుగా గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం సాయంత్రం ఖాళీ బిందెలతో గ్రామానికి ఆనుకొని ఉన్న వ్యవసాయ బావుల వైపు పరుగులు తీయాల్సి వస్తుందని గ్రామస్థులు వాపోయారు. ఎన్నోమార్లు మండల అధికారులకు ప్రజాప్రతి నిధులకు తెలిపిన పట్టించుకోక పోవడంతో రెండు గ్రామాలలోని గిరిజనులు ఖాళీ బిందెలతో రోడ్డు పైకి వచ్చి రాస్థారోక్కో చేశారు. దర్నాకు దిగి దాదాపు మూడు గంటల పాటు రోడ్డు పై నుండి ఆయాగ్రామాల ప్రజలు వచ్చి పోయే వాహనాలను నిలిపి వేశారు. మండల అధికారులు ప్రజాప్రతి నిధులు వచ్చి మా సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేసిన కనీసం ఏ ఒక్కరు అటు కన్నేత్తి చూడక పోవడం విడ్డూరం. వ్యవసాయ పొలాల నుండి నీటిని తెచ్చుకోవడానికి వెళ్లితె రైతులు గొడవలకు దిగుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైన గ్రామాలలో ప్రత్యేకంగా బోర్లు వేసి మంచి నీటిని అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఆయా గ్రామాలలో త్రాగు నీటి సమస్యను పరిష్కించాలి… దేవారాం నాయక్…
మండల పరిదధిలోని ఎన్నో అనుబంధ గ్రామాలలో త్రాగు నీటి సమస్య ఉన్నదని ఇప్పటికైన మండల అధికారులు వెంటనే గ్రామాలలోని నీటి సమస్యలు పరిష్కరించాలని నవసమాజ్ నిర్మాణ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సపావటట్ దేవారాం డిమాండ్ చేశారు. గిరిజనులు చేపట్టిన ధర్నాకు ఆయన మద్ధతు తెలిపారు. అంతే కాకుండా మండలంలోనా రంగాపూర్ అనుబంధ గ్రామం జిలాల్‌మియ్య పల్లేలో సైతం త్రాగునీటి సమస్య ఉన్నదని ఆయా గ్రామల సర్పంచ్‌లకు చెప్పితే మరో ఐదు రోజులలో మా పదవికాలం ముగుస్థుందని సమాధానం చెప్పుతున్నారని అన్నారు.