Search
Friday 21 September 2018
  • :
  • :

కొండా లక్ష్మణ్‌కు ఘన నివాళి

mdk2సంగారెడ్డి : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి జిల్లా నేతలు, అధికారు లు సోమవారం ఘన నివాళులర్పించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కొండా లక్ష్మణ్ జయంతి కార్యక్రమంలో తొలుత ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ బాపూజీ ఆశయాల సాధన కు అంతా కృషి చేయాలన్నారు. వెనుక బడిన వర్గాల సంక్షేమా నికి ఎంతో కృషి చేశారని, వారి సేవలను గుర్తించి ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతిని అంతా తెలుసుకోవాలన్నారు. బాపూజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి బాపూజీ ఎంతో పాటు పడ్డారని, సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పని చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు ఎలాంటి పదవులు చేపట్టబోనని శపథం చేసి కడదాకా అదే మాటపై ఉన్న మహనీ యుడని కొనియాడారు. తెలంగాణ వచ్చే వరకు ఆయన జీవిం చి లేకపోవడం బాధాకరమని అన్నారు. అయినప్పటికీ ఉద్యమ పథంలో ఆయన చూపిన మార్గం ఎంతో మందికి స్ఫూర్తి దాయకమని అన్నారు. బిసి సంక్షేమాధికారి బాల్‌చందర్, బిసి సంఘాల ప్రతినిధులు బీరయ్య యాదవ్, రమేష్‌గౌడ్, రాములు, సత్యనారాయణ, కృష్ణ, వెంకన్న, అ నంతయ్య, టిఆర్‌ఎస్ నేతలు శ్రీనివాసాచారి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Comments

comments