Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

హరికృష్ణకు నివాళులర్పించిన వెంకయ్య

Venkaiah-Naidu

హైదరాబాద్: నటుడు, మాజీ ఎంపి హరికృష్ణ పార్థివదేహానికి రాజకీయ, సినీప్రముఖులు నివాళులర్పించారు. హరికృష్ణ పార్థివదేహానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. గురువారం హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపి కవిత, మాగంటి బాబు, సీతక్క, రాఘవేంద్రరావు, నాగార్జున, జగపతిబాబు, అల్లు అర్జున్, కోట శ్రీనివాసరావు, బెనర్జీ, వేణుమాధవ్ ఉన్నారు. హరికృష్ణ దుర్మరణం చాలా విచారకరమని వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన నిర్బీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరించేవారన్నారు. తండ్రికి తగిన తనయుడిగా అచంచల ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి అని పొగిడారు.

ఏ పనైనా చిత్తశుద్ధితో చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని ప్రసంశించారు. ఏ విషయమైనా సీతయ్య కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారన్నారు. రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడుతానని గట్టిగా చెప్పారని గుర్తు చేశారు. ఆనాటి చైర్మన్ అభ్యంతరం తెలిపితే తాను జోక్యం చేసుకుని తర్జుమా చేశానన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్నారని మెచ్చుకున్నారు. హరికృష్ణకు ప్రజాభిమానం మెండుగా ఉందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వెంకయ్య తెలిపారు.

Comments

comments