Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కొమ్రం భీంకు ఘన నివాళి

Tribute-to-Komaram-Bheemభీం విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రి, కలెక్టర్, దళిత సంఘాల నాయకులు

మన తెలంగాణ / ఆదిలాబాద్ అర్బన్: మన్యం వీరుడు, ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రం భీం 763 వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో మంత్రి, ఆది లాబాద్ ఎంపి గడ్డెం నగేష్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, వివిధ ఆది వాసీల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొమ్రం భీం చౌరస్తాలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ డా.జ్యోతి బుద్ద ప్రకాష్, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా పవన్ రావ్, టిఆర్‌ఎస్, బిజెపి పశ్చిమ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు యూనిస్ అక్బానీ, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనిల్‌కుమార్, టియుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం, ఆదివాసీల సంఘాల నాయకులు పూల మాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అటు అంబే ద్కర్ భవన్‌లో టిఎస్ ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లేల మనోజ్ కుమార్, నక్క రాందాస్‌లు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు ఆదివాసుల జీవితల్లో వెలుగు నింపిన మహానేత కొమ్రం భీం అని కొనియాడారు. ఆదివాసులకు ప్రభుత్వం, అధికారులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడే కొమ్రం భీం ఆశయాలు నేరవెరుతాయన్నా రు. మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కొమ్రం భీం పోరాటల యోదుడని ఆయన కృషి వల్ల ఆదివాసుల జీవితా ల్లో వెలుగులు నిండయాని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ మాట్లాడుతూ ఆదివాసుల సమస్యలు పరిష్కరించ డమే కాకుండా భీం ఆశయ సాధనకు అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. ఇదిలా ఉంటే కొలాం ఆశ్రమ పాఠశాలలో ఎస్‌ఎఫ్‌ఐ నాయ కులు భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక బస్టాండ్ ఎదుట గల భీం విగ్రహానికి ఆదిమ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో భీం వర్ధంతి సందర్భంగా పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆది వాసుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.

Comments

comments