Home జగిత్యాల జోరుగా ‘త్రీ’ ‘ట్రబుల్’ రైడింగ్

జోరుగా ‘త్రీ’ ‘ట్రబుల్’ రైడింగ్

Triple-Riding

కోరుట్ల రూరల్‌:  ప్రస్థుత రోజుల్లో త్రీబుల్ రైడింగ్‌లు అధికమౌతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలతో రహాదారులపై రక్తం చిందుతునే ఉంది. మితిమీరిన వేగంతో వెల్లి మృత్యుడి లోకి చేరుతున్న వాహానాల వేగం మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా పాతికేళ్ళుకూడా నిండని కుర్రాళ్ళే వా హానాలపై ముగ్గురుగా వెలుతు రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నారు. వాహనం నడిపే విధానం కూడా సరి గా తెలియని యువకుల ఆ జాగ్రత్తతో జనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతునే ఉన్నాయి. త్రిబుల్ రైడింగ్‌ల తో రోడ్లపైకి చేరడమే కాక వెకిలి చేష్టలు,అరుపులతో హల్‌చల్ చేస్తున్నారు.

ఓ పక్క రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని పోలీసులు హెచ్చరిస్తు జాగ్రత్త సూచికలు తెలుపుతు తనిఖీలు చేసిన తీరు మార్చుకోలేక రోడ్డు ప్రమాదాలతో ఆసుపత్రుల పాలౌతున్నారు. కోరుట్ల పట్టణ శివారులోగల వెటర్నరి కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇబ్రహీంపట్నం మండలం అ మ్మక్కపేట గ్రామానికి చెందిన దంపతులు మృత్యువా త పడిన ఘటన మరువక ముందే మండలంలోని చిన్నమెట్‌పల్లి గ్రామంలో మరో రోడ్డు ప్రమాధం జరిగి 50 ఏళ్ళ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. అంతలోనే తెలంగాణ విగ్రహం వద్ద ద్విచక్ర వాహనం పై వెలుతున్న ఓ వృద్దుడి ఆలో డీ కొట్టగా ఆ వృద్దుడు కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

*మహిళలు సైతం అదే తీరు….
ఇటీవల కాలంలో స్కూటీల విక్రయాలు అధికంగా పె రుగుతునే ఉన్నాయి. మహిళ ఉద్యోగులు, నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు మహిళలకు సౌకర్యవంతంగా ఉండేందుకు పలు కంపెనీలు స్కూటీ లను మార్కెట్‌లోకి చేరుస్తున్నారు. కానీ కొందరు మ హిళలు సైతం ముగ్గురు కలిసి స్కూటీలపై ప్రయాణం చేస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహన వేగాలతో మహి ళలు భయపడుతూ, తడబడుతునే ఉన్నారు. దైర్యంతో వారు కూడా ముగ్గురుగా వెలుతు నిబందనలు ఉల్లంగిస్తున్నారు.

*ట్రాఫీక్ రూల్స్ పాటించలేరా?….
వాహనాదారులు సరియైన పత్రాలు, ప్రతి ద్విచక్ర వాహానదారులుహెల్మెట్ ధరించడంతో పాటు,ట్రాఫీక్ నిబందనలు పాటించాలని పోలీసులు సూచికలు అందిసున్న మాత్రం పట్టించుకునున్నవారు లేరు. కొందరు యువకులు రోడ్డపై అతివేగంతో వాహనాలు నడిపే విధనం చూసిన జనాలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. మధ్యం మత్తులో సైతం వాహనాల జోరు తగ్గని చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ పిల్లలు రోడ్లపై ఎంతి నిర్లక్షవైఖరిలు చూపుతున్నారో చూడలేని తల్లితండ్రులు పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు నిద్రలోకి జారుకునే అవకాశం లేకుండా పోతుంది. యువకులు,వాహానాదారులు వేగం తగ్గించాలని ట్రాఫీక్ నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు తప్ప వంటు హెచ్చరిస్తున్నాడు కోరుట్ల ఎస్‌ఐ కృష్ణకుమార్.