Home తాజా వార్తలు రాజ్యాంగ ధర్మాసనానికి ట్రిపుల్ తలాక్ కేసు

రాజ్యాంగ ధర్మాసనానికి ట్రిపుల్ తలాక్ కేసు

Muslims

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించి నిర్ణయం వెలువరించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది. చీఫ్ జస్టిస్ జెఎస్ ఖెహర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ట్రిపుల్ తలాక్‌కు సంబంధించిన కేసులను వచ్చే నెల 30న రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని తెలిపారు.