Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఈ చేప రూటే వేరు..!

Research-on-Fish

వైజాగ్ సాగర జలాల్లో కలరా వ్యాధిని అదుపులో ఉంచే చేపను ఆంధ్రా యూనివర్సిటీలోని పరిశోధకులు గుర్తించారు. చిన్న ముక్కు ఉండే త్రిపాద చేపలో సూక్ష్మజీవులను చంపే గుణా లు ఉన్నాయని వారి పరిశోధనల్లో తేలింది. ఈ చేపల్లోని కండర భాగ కణజాలం మానవుల్లో రోగాలకు కారణమైన సూక్ష్మజీవులను అంతమొందిస్తోందని పరిశోధకులు గుర్తించారు.

ఇకోలి, సాల్మొనెల్లా టైఫీ, సుడోమోనాస్, విబిరో కలరా, స్టాఫీలోకోకస్ ఆరస్ అనే ఐదు రకాల బ్యాక్టీరియాలతో పోరాడే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వీటిలో ఉన్నాయని ఆంధ్రాయూనివర్సిటీకి చెందిన  పరిశోధన బృందం సభ్యులు ఎన్‌ఎం కృష్ణ, వి. గోవిందరావు తెలిపారు. సముద్ర జీవజాలంలో అనేక ఔషధ గుణాలు ఉండగా, ఇప్పటి వరకు వాటిపై పరిశోధనలు చేసింది తక్కువేనని తెలిపారు. త్రిపాద చేపను పరీక్షించగా దాని కండర భాగం మానవుల్లోని వ్యాధికారక సూక్ష్మజీవులతో పోరాడుతుందని తెలిసినట్లు చెప్పారు.

Tripod fish along Vizag coast can curb cholera.

Comments

comments