Home తాజా వార్తలు లేడీ ఓరియెంటెడ్ మూవీ

లేడీ ఓరియెంటెడ్ మూవీ

Trisha Krishnanగత ఏడాది ‘96’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరోయిన్ త్రిష ఆతర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ‘పేట’ చిత్రంలో నటించింది. అనంతరం కొంచెం బ్రేక్ తీసుకున్న ఈ భామ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ స్టోరీ అందిస్తున్న ఈ చిత్రాన్ని శరవణన్ తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో తాజాగా ప్రారంభమైంది. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రాంగి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే త్రిష నటించిన లేడీ ఓరియెంటెడ్ సిని మాల్లో ఏ ఒక్కటి కూడా హిట్ కాలేదు. మరి ఈ చిత్రం సక్సెస్‌ను సాధి స్తుందా అనేది చూడాలి.

Trisha Krishnan new film titled Raangi