Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రెండు, మూడు నెలల్లో పెళ్లి?

Trisha wants to quit movies after marriage

ఇప్పుడు హీరోయిన్ల పెళ్లి వ్యవహారాలన్నీ రహస్యంగా సాగిపోతున్నాయి. మొన్నటికి మొన్న శ్రియ ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సోనమ్‌కపూర్, నేహా దుపియాలు కూడా ఈవిధంగానే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి త్రిష కూడా చేరనుందని తెలిసింది. ప్రస్తుతం త్రిషను చూస్తుంటే ఇలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. తాజాగా 35వ ఏట అడుగుపెట్టిన ఈ భామ భారీగా షాపింగ్ చేస్తోంది. ఈమధ్యే తన ఫ్రెండ్స్‌తో కలిసి విదేశాలకు కూడా వెళ్లి వచ్చింది. అక్కడ కూడా భారీ షాపింగ్ చేసింది. ఆమె షాపింగ్ చూస్తుంటే ఖచ్చితంగా అది వెడ్డింగ్ షాపింగే అని అంటున్నారు సినీ జనాలు. త్రిష పెళ్లి గురించి కొంత కాలంగా కొన్ని వార్తలు వచ్చాయి.  ఓ బిజినెస్‌మేన్‌తో ఆమె చాలా సన్నిహితంగా ఉంటోందంటూ దాదాపు నాలుగేళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. వీటిని త్రిష తల్లి ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆమె పెళ్లి గ్యారెంటీ అంటూ గట్టిగా ప్రచారం సాగుతోంది. మరో రెండు, మూడు నెలల్లో త్రిష పెళ్లి చేసుకునే ప్లాన్‌లో ఉందట. ప్రస్తుతం ఆమె చేతిలో అర డజను సినిమాలున్నాయి. వీటిలో మూడు సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మూడు సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఆ మూడు పూర్తయిన వెంటనే త్రిష పెళ్లి వార్త బయటకొచ్చే అవకాశముంది.

Comments

comments