Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఫిబ్రవరిలో సెట్స్‌పైకి త్రివిక్రమ్ చిత్రం

pkత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ మూవీ ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ భామ కీర్తి సురేష్ ఒక హీరోయిన్‌గా ఫైనల్ కాగా… మరో భామగా అను ఇమాన్యుయల్‌ను ఖరారుచేశారట. అయితే ప్రస్తుతం శరవేగంగా  సినిమాలు చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు. దీంతో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లో అతను పాల్గొంటాడని అన్నారు. కాటమరాయుడు చిత్రంతో పాటు త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌ను కూడా పవన్ ప్రారంభించేస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు కథ మారిపోయిందట. ఫిబ్రవరిలోనే త్రివికమ్ సినిమాను ప్రారంభిస్తాడట పవన్. ముందుగా జనవరి చివరికల్లా కాటమరాయుడును పూర్తిచేసి… ఫిబ్రవరిలో త్రివిక్రమ్ మూవీని మొదలుపెట్టేలా ప్లాన్ చేశారని సమాచారం. ఎస్.రాధాకృష్ణ నిర్మించే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నాడు.

Comments

comments