Search
Sunday 18 November 2018
  • :
  • :

త్రివిక్రమ్ ప్రాజెక్టుపై పాజిటివ్‌గా…

trivikram srinivas next movie with allu arjun

ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో దర్శకుడు విక్రమ్ కుమార్‌తో సినిమా చేయడం కరెక్టా, కాదా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడట అల్లు అర్జున్. విక్రమ్ తీసే సినిమాలు ప్రయోగాత్మకంగా, క్లాస్‌గా ఉంటాయి కానీ మాస్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ఉండవు. దీంతో బన్నీ ప్రత్యామ్నాయాలు వెతుకున్నాడట. అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టుపై కాస్త పాజిటివ్‌గా ఉన్నాడని తెలిసింది. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరా పండుగకు విడుదలకానుంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ నెక్స్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. వెంకటేష్‌తో ఒక సినిమా లైన్‌లో ఉన్నప్పటికీ అది సెట్స్‌పైకి వెళ్లేందుకు మరికొంత సమయం పడుతుందట. దీంతో అల్లుఅర్జున్ త్రివిక్రమ్ వైపు చూస్తున్నాడు. ఈ స్టార్ డైరెక్టర్ అయితే తన ఇమేజ్‌కు తగ్గట్టు సినిమా చేయగలడని భావిస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ కాంబినేషన్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్.

Comments

comments