Home అంతర్జాతీయ వార్తలు చికాగోలో ట్రంప్‌కు ట్రబుల్

చికాగోలో ట్రంప్‌కు ట్రబుల్

ప్రచార ర్యాలీ రద్దు
విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వందలాది మంది ఆందోళన
ఇది చాలా చిన్న ప్రతిఘటనేనన్న ట్రంప్
trumph1చికాగో: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రిపబ్లికన్ పార్టీ నుంచి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు చికాగోలో చేదు అనుభవం ఎదురైంది. ఎరేనా ప్రాంతం లో వందలాది మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ట్రంప్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో ట్రంప్ నిర్వహించాల్సిన ప్రచార ర్యాలీ రద్దు చేసుకో వాల్సి వచ్చింది. చికాగోలోని ఇల్లినాయిస్ యూనివ ర్శిటీ వద్ద ర్యాలీ ఆలస్యమవుతుందని మొదట వెల్లడించారు. ఆ తర్వాత ర్యాలీని వాయిదా వేస్తామని తెలిపారు. చివరకు భద్రతా కార ణాల వల్ల ప్రచార ర్యాలీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాలో ఆందోళనల వల్ల రాజకీయ నాయకుల ర్యాలీ రద్దు కావడం చాలా అరుదైన విషయం. చికాగో ర్యాలీ రద్దు కావడంతో ‘ఇది చాలా విషాదకరమైన రోజు’ అని ట్రం ప్ ప్రత్యర్థులు టెడ్ క్రుజ్, మార్కో రుబి యా అభివర్ణించారు. ట్రంప్ రాజకీయ ప్రసంగాలు విద్వేషం, శత్రుత్వాన్ని పెంచుతున్నాయని వారు విరుచు కుపడ్డారు. ట్రంప్ ర్యాలీకి వేలాది మంది ప్రజలు హా జరయ్యారని, ఆ సమ యంలో వందలాది మంది ట్రంప్ వ్యతి రేకులు నిరసనలు తె లుపుతూ ఆడిటోరియం లోకి ప్రవేశించారని, ఆయన ర్యాలీని జరగనీయమని వారు తెలి పారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ట్రంప్ మరికొద్ది సేప ట్లో వస్తారనగా ఆడిటోరియం లోపల నిరసనకారుల జెండాలు ఊపుతూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. దాంతో ట్రంప్ మద్దతుదారులకు, నిర సనకారులకు మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. దాదాపు అన్ని వార్తా ఛానెళ్లు ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ ప్రచారం ప్రారం భించినప్పటి నుంచి ఆయన ర్యాలీల్లో తరచు నిరసనలు వ్యక్తమవుతున్నా పరిమిత సంఖ్యలోనే నిరసనకారులు కనిపిస్తూ వచ్చారు. వారిని సభాస్థలి నుంచి బయటకు తీసుకువెళ్లడం జరిగేది. అయితే చికాగో ప్రచార ర్యాలీ సందర్భంగా వందలాది మంది ట్రంప్ వ్యతిరేక నినా దాలు చేస్తూ ఆయన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నా రంటూ నినాదాలతో హోరెత్తించినట్టు పలు ఛానెల్స్ పేర్కొన్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తన నిరసన చేపట్టడం ఇదే మొదటిసారని కూడా చెబుతున్నారు.
హింస ఇష్టం లేకనే…
కాగా, ప్రచార ర్యాలీని నడిపించి ఉండవచ్చనీ, అయితే ఎలాంటి హింస చెలరేగడం ఇష్టం లేకనే ర్యాలీని రద్దు చేశామని ట్రంప్ తెలిపారు. సభ వెలుపల, లోపల తన మద్దతుదారులు 25 వేల మందికి పైగా ఉన్నారని, నిరస నకారులు 2 నుంచి 3 వేల వరకూ ఉండొచ్చని ఆయన తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంటుందని, అయితే ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఆడిటో రియం వద్ద జరిగింది చాలా చిన్న ప్రతిఘటన అని ఆయన కొట్టిపారేశారు. ఈరోజు వరకూ తమకు ఎలాం టి సమస్య ఎదురుకాలేదని చెప్పారు. తన ప్రసంగాలు ఉద్వేగపూరితంగా ఉంటున్నాయనడాన్ని ఆయన తోసి పుచ్చారు. అది అసలు సమస్యే కాదన్నారు. కాగా, ట్రంప్ ర్యాలీని రద్దు చేయడంతో నిరసనకారులు ‘మేము ట్రంప్‌ను నిలువరించగలిగాం’ అంటూ ట్రంప్ చిరునవ్వులు చిందించారు.