Home పెద్దపల్లి తిరనున్న నీటి కష్టాలు

తిరనున్న నీటి కష్టాలు

harish

*సాగునీరు విడుదలకు ఆదేశాలు ఇచ్చిన
మంత్రి హారీష్‌రావు
*కొప్పుల ఈశ్వర్ చొరవతో తీరిన నీటి కష్టాలు

మనతెలంగాణ/ధర్మారం: పత్తిపాక ప్రజల నీటి కష్టాలు తీ ర్చేందుకు మంత్రి హరీష్‌రావు అంగీకరించారు. ధర్మారం మండలంలోని తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పత్తిపా క రైతుల ఆవేదనకు స్పందించిన మంత్రి హరీష్ మల్లాపూర్ నుండి వెళ్తున్న ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని నీటి పారుదల శాఖ ఇంజనీర్ శాఖ అనిల్ కు మార్‌ను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పల ఈశ్వర్ ప్రత్యేక చొరవ తో ధర్మారం మండల ప్రజా ప్రతినిధులు తమ రైతుల బృ ందం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని జనసందోహం లో మంత్రి హారీష్‌రావును కలిసి నీటి కష్టాలను వివరించా రు. ఎస్సారెస్పీ సౌకర్యం లేకపోవడం పూర్తి కరువు ప్రాంతమైన పత్తిపాకకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల ను ండి 30 నుంచి 50 లక్షలు ఖర్చు అయిన తానే పైప్ వేయిస్తానని మేడారం నుంచినారాయణపూర్ వెళుతున్న ఎల్లంపల్లి ప్రధాన పైప్ లైన్‌కు అనుసంధానం చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈశ్వర్ కోరగా వెంటనే స్పందించి మంత్రి ఇంజనీరు చీఫ్‌కు ఆదేశాలు ఇచ్చారు.
చుక్క నీరు లేక బీళ్లుగా మారిన భూములు తమ సాగుకు నీరు లేక అల్లాడుతున్న పత్తిపాక రైతుల క ష్టాలను తీర్చిన మంత్రి హరీష్‌రావుకు ఇందుకు కో సం అపార కృషి చేసిన చీఫ్ విప్ ఈశ్వర్‌కు ప్రజా ప్రతినిధులు,రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కా ర్యక్రమంలో ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త న ర్సింహులు, మేడారం సింగిల్ విండో చైర్మన్ పూ స్కూరి నర్సింగరావు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు పూస్కూరి జితేందర్‌రావు,వెల్గటూర్ ఎం పిపి పొనుగొంటి శ్రీనివాస్‌రావు,సర్పంచ్‌లు గం దం మల్లయ్య, ఎగ్గెల స్వామి, ధర్మారం మార్కెట్ క మిటీ వైస్ చైర్మన్ కొమ్మటి రెడ్డి మల్లారెడ్డి, ఎంపిటీసీ తిరుపతిరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు పాక వేంకటే శం, వెల్పుల నాగరాజు, కారుపాకల రాజయ్య, ఎ లుక రాజయ్య, మేనేని వెంకటేశ్‌రావు, నోముల వె ంకట్‌రెడ్డి, జంగిలి కనుకయ్య పాల్గొన్నారు.