Home తాజా వార్తలు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్

పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్

KTRహైద‌రాబాద్: టిఆర్ఎస్ పార్టీ శనివారం 18వ ఆవిర్భావ దినోత్సం జ‌రుపుకుంటున్న‌ విషయం తెలిసిందే.  ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో టిఆర్ఎస్ ఆవిర్భావ  వేడుకుల‌ను పార్టీ కార్యకర్తలు నిరాడంబ‌రంగా జరుపుకుంటున్నారు. టిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ శుభ‌కాంక్ష‌లు తెలిపారు. 2001, ఏప్రిల్ 27వ తేదీన కెసిఆర్ ప్రారంభించిన సాహ‌సోపేత ప‌య‌ణం ఇప్పుడు లెజండ‌రీగా మారింద‌ని ఆయన ట్వీట్ చేశారు. టిఆర్ఎస్ కోసం ప‌నిచేస్తున్న ల‌క్ష‌లాది మంది నేత‌ల‌కు, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కెటిఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. మై అకేలా హీ చ‌లాతా జానిబ్ ఏ మంజిల్ మ‌గ‌ర్‌.. లోగ్ సాత్ ఆతే గ‌యే ఔర్ కార్‌వా బ‌న్‌తా గ‌యా’ అనే హిందీ కవితను కూడా కెటిఆర్ ట్వీట్ చేశారు.‘ నేను ఒంట‌రిగానే గమ్యం వైపు ప‌య‌నిస్తూ ఉన్నాను.. కానీ ప్ర‌జ‌లు నా వెంటే న‌డుస్తూ.. ప్ర‌వాహంలా క‌లిసిపోయారనే అర్ధంలో ఈ కవిత ఉంది.

TRS Birthday Celebrations : KTR Wishes to TRS Workers