Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ అభ్యర్థుల ముమ్మర ప్రచారం

టిఆర్‌ఎస్ అభ్యర్థుల ముమ్మర ప్రచారం

TRS Candidatesఅచ్చంపేటరూరల్(నాగర్ కర్నూల్) : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ప్రచారం చివరి రోజు అయిన ఆదివారం టిఆర్ఎస్ అభ్యర్థులు  ముమ్మర ప్రచారం చేశారు.  చెన్నారం ఎంపీటీసీ అభ్యర్థి వర్దం నారమ్మ, హాజిపూర్ అభ్యర్థి చీమర్ల అమరావతి, బొమ్మనపల్లి ఎంపీటీసీ అభ్యర్థి ఉడుత విష్ణువర్దన్, ఐనోల్ ఎంపీటీసీ అభ్యర్థి పాత్ల వత్ చాంది, రంగాపూర్ ఎంపీటీసీ అభ్యర్థి ఆర్. శాంతాబాయి,సిద్దాపూర్ ఎంపీటీసీ అభ్యర్థి పోలం రాజు, ఘణపూర్ ఎంపీటీసీ అభ్యర్థి సభవత్ హ రిలాల్, మన్నెవారిపల్లి ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ లు టీ ఆర్ ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వీరి గెలుపును కాంక్షిస్తు గ్రామాలలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సింగారం గ్రామంలో సర్పంచ్ నీలం లక్ష్మమ్మ అధ్యక్షతన రచ్చబండ దగ్గర జరిగిన కార్యక్రమంలో టిఆర్ఎస్ సినియర్ నాయకులు పోకల మనోహార్ మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు రూపొందించి దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చంద్ర సాగర్ చెరువును రిజ ర్వాయర్‌గా మార్చి బీడు బారిన ప్రతి ఏకరాకు సాగునీరు అందించి అభివృద్దికి పాటుపడుతామని ఎంపీపీ పర్వతాలు అన్నారు. మంగళవారం జరుగే పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించే భాద్యత ప్రజలదని ఆయన చెప్పారు సమస్యల పరిష్కరానికి కృషి చేస్తే భాద్యత టిఆర్ఎస్ ప్రతినిధులదని మండల పార్టి అధ్యక్షులు ఎడ్ల నర్సింహ్మలు స్పష్టం చేశారు. బొమ్మనపల్లి , కిష్టతాండ, బాల్యతాండ ,శివారు తాండ, చెదురుబావితాండ, దుబ్బతాండ, కొర్రతాండ గ్రామాల లో పరిషత్ ఎన్నిక ల ప్రచారంలో ఆయన ఎంపీటీసీలు అభ్యర్థి ఉడుత విష్ణువర్దన్ , చాంది , టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. టిఆర్ ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి మూడవత్ మంత్రియా నాయక్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ది కోసం చిత్తశు ద్దితో పనిచేస్తానని హామీ ఇచ్చారు. చంద్రసాగర్ చెరువును స్థాయి పెంచి రిజర్వాయర్‌గా ఏర్పా టు చేసి పదిహేనే వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషి చేస్తున్నారని అన్నారు. సాగునీరు అందించేందుకు జిల్లా సమీక్ష సమావేశంలో ఆందోళన చేసైనా సాధిస్తానని హామీ ఇచ్చారు. పాలశీతలీకరణ కేంద్రం చైర్మెన్ సిఎం రెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చాడం కోసం ఈ ప్రాంత వాడిగా అందుబాటులో ఉంటానని హమీ ఇచ్చారు. హాజీపూర్ ఎంపీటీసీ అభ్యర్థి చీమర్ల అమరావతిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. చెన్నారం ఎంపీటీసీ అభ్యర్థి నారమ్మ విజయన్ని కాంక్షిస్తూ కాన్య తాండ, పెద్దతాండ, ఎద్దుమిట ్టతాండ, చెన్నారం , సింగారం గ్రామాల్లో టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి బైక్, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రామకృష్ణ రెడ్డి, సర్పంచ్లు బోడ్కనాయక్, లోక్యానాయక్, కేతవత్ సువాలి, మూడవత్ కేళి, బుజ్జి, టీఆర్ఎస్ సీనియర్ ,నాయకులు రాజేందర్ , బోడ నారాయణ, జగన్‌మోహన్‌రెడ్డి, అంజి యాదవ్, గోపాల్,రమేష్, శ్యాం సుందర్ యాదవ్, బాలస్వామి, తిరుపతయ్య, లక్ష్మోజీ, వెంకటయ్య, శ్రీను, ఉస్సేన్, పాల్గొన్నారు.

TRS Candidates Elections Campaign in Achampet