Home తాజా వార్తలు సిఎంగా రేపు కెసిఆర్ ప్రమాణ స్వీకారం

సిఎంగా రేపు కెసిఆర్ ప్రమాణ స్వీకారం

TRS Chief KCR Sworn as CM Tomorrowహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 స్థానాలు గెలిచిన టిఆర్‌ఎస్ కొత్త ప్రభుత్వాన్ని గురువారం ఏర్పాటు చేయనుంది. గురువారం 1.30 గంటలకు రాజ్‌భవన్‌లో సిఎంగా రెండోసారి కెసిఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొద్ది మంది ఎంఎల్‌ఎలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. సిఎం తనతో పాటు 16 మందిని మంత్రులుగా నియమించవచ్చు. అయితే సిఎం కెసిఆర్ ఒక్కరే ప్రమాణం చేస్తారా, తనతో పాటు కొద్ది మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారా అన్న విషయం మాత్రం తెలియరాలేదు.

TRS Chief KCR Sworn as CM Tomorrow