Home తాజా వార్తలు వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ : కెటిఆర్

వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ : కెటిఆర్

TRS Clean Sweep in Next Elections: KTR

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలంగాణ మంత్రి, సిరిసిల్ల టిఆర్‌ఎస్ అభ్యర్థి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 85 సీట్లు గెలుస్తుందని ఎన్‌డిటివి చేసిన సర్వేపై ఆయన స్పందించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీ టిఆర్‌ఎస్‌ను విజయపథాన నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రతిపక్షాలు ముందుకొస్తున్నాయని, వారికి తగ్గిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో టిఆర్‌ఎస్‌కు ఉన్న ఆదరణే ఎన్‌డిటివి సర్వేను ప్రతిబింబించిందన్నారు. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 63 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అదనంగా 32 సీట్లు గెలుస్తుందని ఎన్‌డిటివి సర్వే తేల్చి చెప్పింది. గత నెల రోజులుగా టిఆర్‌ఎస్ అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాల కంటే ప్రచారంలో టిఆర్‌ఎస్ నేతలు ముందున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

TRS Clean Sweep in  Next Elections: KTR