Home తాజా వార్తలు పరిషత్ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ జిల్లా ఇంఛార్జ్‌ల నియామకం

పరిషత్ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ జిల్లా ఇంఛార్జ్‌ల నియామకం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు ఇంఛార్జ్‌లను ప్రకటించారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో సోమవారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయిలో పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మంత్రులు, మాజీ మంత్రులు, ఎంఎల్‌సి, పార్టీ సీనియర్ నేతలకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. మేడ్చల్ జిల్లాకు మంత్రి మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లాకు ఎంఎల్‌ఎ అంజయ్య యాదవ్‌ను నియమించారు. అలాగే వికారాబాద్ ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల ఇంఛార్జ్‌గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, భూపాలపల్లి, ములుగు జిల్లా ఇంఛార్జ్‌గా బాల మల్లు, నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్‌గా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని నియమించారు. కరీంనగర్, సిరిసిల్ల ఇంఛార్జ్‌గా మంత్రి ఈటెల రాజెందర్, నిర్మల్, అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇంఛార్జ్‌గా మంత్రి ఇంద్రకరన్‌రెడ్డి, అదిలాబాద్ ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి జోగు రామన్న, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ఇంఛార్జ్‌గా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు.

సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల ఇంఛార్జ్‌గా ఎంఎల్‌సి శేరి సుభాష్‌రెడ్డి, సిద్దిపేట, మెదక్ ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి టి.హరీష్‌రావును, నల్గొండ ఇంఛార్జ్‌గా టి.రవీందర్‌రావును నియమించారు. యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాల ఇంఛార్జ్‌గా ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సూర్యాపేట ఇంఛార్జ్‌గా మంత్రి జి.జగదీష్‌రెడ్డిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంఛార్జ్‌గా ఎంఎల్‌సి సత్యవతి రాథోడ్‌ను, నాగర్ కర్నూల్ ఇంఛార్జ్‌గా పి.రాములు, ఖమ్మం ఇంఛార్జ్‌గా రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డిని, గద్వాల, వనపర్తి జిల్లాల ఇంఛార్జ్‌గా మంత్రి నిరంజన్‌రెడ్డిని, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల ఇంఛార్జ్‌గా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లను సిఎం కెసిఆర్ నియమించారు.

TRS District Incharge Appointment for Parishad Elections