Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

టిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

TRS Election Manifesto Committee Set Up

హైదరాబాద్ : టిఆర్‌ఎస్ చీఫ్ కెసిఆర్ ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. గురువారం మధ్యాహ్నం ఆయన అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్‌కు ఇవ్వడం, ఆయన అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం కెసిఆర్ తెలంగాణ ఆపద్ధర్మ సిఎంగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు. మిగిలిన అభ్యర్థులను పది రోజుల్లో ప్రకటించనున్నారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపి కె.కేశవరావు చైర్మన్‌గా టిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. కె.కేశవరావు చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో జితేందర్‌రెడ్డి, నగేష్, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, అజ్మీర చందూలాల్, టి.పద్మారావు, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఫరీదుద్దీన్, పి.రాములు, గుండు సుధారాణి తదితరులు సభ్యులుగా ఉంటారు.

TRS Election Manifesto Committee Set Up