Home తాజా వార్తలు నిరాడంబరంగా టిఆర్‌ఎస్ పుట్టుక పండగ

నిరాడంబరంగా టిఆర్‌ఎస్ పుట్టుక పండగ

TRS

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరపాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులను ఆదేశించారు. గురువారం కెటిఆర్ ఈమేరకు ప్రకటన  విడులదల చేశారు. ఈ నెల 27న జరగనున్న టిఆర్‌ఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తు తం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పార్టీ అధిష్టానం ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 27న రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని పార్టీ కార్యాలయాల ముందు జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని కెటిఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన తెలిపారు. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు జెండావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 18 సంవత్సరాల టిఆర్‌ఎస్ ఎన్నో మైలు రాళ్లను అధిగమించి రాష్టాభివృద్ధిలో దేశానికి దిక్చూచిగానిలిచింది. ఉద్యమ పార్టీనుంచి రాజకీయ పార్టీగా అవతరించి బంగారు తెలంగాణ సాధనలో దూసుకు పోతున్న టిఆర్‌ఎస్ ఆవిర్భావదినోత్సవం నిరాడంబరంగా జరుపుకోవడం తొలిసారి అవుతుంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పార్టీ అధిష్టానం ఈనిర్ణయం తీసుకుందని పార్టీ నాయకులు చెప్పారు.

TRS Formation Day Celebrations in Telangana