Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సెప్టెంబర్ లో ఎంఎల్ఏ అభ్యర్థుల ప్రకటన: సిఎం కెసిఆర్

TRS Government Has No Tension for 2019 Elections

హైదరాబాద్: టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం అని ఆయన అన్నారు.9 నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించాం. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వనప్పటికీ రూ. 20 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం. వరి, మొక్క ధాన్యాలకు మద్దతు ధర రూ. 2 వేల చొప్పున ఉండాలని కోరుతాం అని సిఎం కెసిఆర్ అన్నారు. ఎస్సి, ఎస్టిల రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరతాం, ఒక్కో రాష్ర్టానికి ఒక్కో నీతి సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పైగా ఉన్న బిసిల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. తమిళనాడు రిజర్వేషన్లను 9 షెడ్యూల్‌లో చేర్చినట్లే తెలంగాణ రిజర్వేషన్లను కూడా చేర్చాలి అని సిఎం చెప్పారు.

కాంగ్రెస్సేతర, బిజెపియేతర కూటమి ఏర్పాటుతో నా ప్రయత్నం ఆగదు. కాంగ్రెస్ చెప్తున్న ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ అనేది సాధ్యం కాదని ఆయన అన్నారు. పంజాబ్ లో హామీ ఇచ్చి నేరవేర్చలేక తలపట్టుకున్నారు. రుణమాఫీ పై కర్ణాటక సిఎం నా సలహా తీసుకున్నారని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ నెలసరి ఆదాయం సగటున రూ.10500 కోట్లని సిఎం తెలిపారు. రాష్ట్ర ఆదాయం బట్టే ఖర్చులు, పథకాలు ఉంటాయి. అన్ని పథకాలకు కేటాయింపులు రద్దు చేస్తేనే ఒకేసారి రుణమాఫీ సాధ్యం. నిరుద్యోగులకు భృతి అనేది సాధ్యం కాదు. ఎవరు నిరుద్యోగులు, ఎంతమంది ఉన్నారు అనేది ఎలా నిర్ణయిస్తారని సిఎం అన్నారు. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు ఇచ్చి మోసం చేయడం కాదని సిఎం అన్నారు. ఏపిలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ లో డ్వాక్రా రుణాలు మాఫీ కోసం ఒత్తిడి చేస్తే నేను ఒప్పుకోలేదు. నిర్ణీత సమయానికి ఆర్నెళ్ల ముందు జరిగే ఎన్నికలు ముందస్తు ఎన్నికలు కాదని సిఎం కెసిఆర్ అన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్‌లోనే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సిఎం కెసిఆర్‌ వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టంచేశార

Comments

comments