Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

‘ఉక్కు’ సంకల్పంతో ఉన్నాం… పరిశ్రమ సాధిస్తాం

 TRS Government to set up steel industry in Bayyaram

మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ఉంది, కేంద్ర ప్రభుత్వంపై అన్ని కో ణాల్లో వత్తిడి తీసుకువచ్చి పరిశ్రమ ఏర్పాటుకు ప్రభు త్వం అన్ని విధాలుగా సర్వే చేయిస్తోందని టిఆర్‌ఎస్ రా ష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు అన్నారు. స్థానిక విజ్ఞానభారతి డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బయ్యారంలో ఉక్కు పరిశ్ర మ ఏర్పాటుకు మెకాన్ సంస్థ సర్వే జరిపిందని, పరిశ్ర మ ఏర్పాటుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో దృఢ సంకల్పంతో ఉందని ఆయన స్ప ష్టం చేశారు. ఫారెస్ట్, పరిశ్రమలు, రెవిన్యూ, సర్వే 4శాఖల అధికారులతో సర్వే అనంతరం పరిశ్రమ ఏర్పాటుకు రెండువేల ఎకరాల భూమి ఉండాలని కోరారని, బయ్యారం మండలం ధర్మాపురం, గార్ల మండలం శేరిపురంలో 5వేల ఎకరాలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఆయన తెలిపారు. అటవీ శాఖకు కూడా భూమికి సరిసమానంగా భూమిని ఇవ్వాలని కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే అధికారులు సూచించినట్లు ఆయన తెలిపారు. కేంద్రం బృందం బయ్యారం ప్రాంతంలో నాణ్యమైన ఖనిజం లేదని సాకుతో వెనక్కు తగ్గడం తగదని, బయ్యారం ఉక్కు ఖనిజాన్ని చత్తీస్‌గడ్ రాష్రంలోని బైలడిల్లకు తరలించేందుకు కూడా రైల్వేలైన్‌కు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని గోదావరి పరివాహక ప్రాంతం నుండి కిన్నెరసానికి నీటిని తరలించి ఆ నీటిని ఉక్కు పరిశ్రమ ప్రాంతానికి తరలించవచ్చన్నారు. అలాగే విద్యుత్ ప్రాజక్టు కూడా సిద్దమవుతోందని, అనంతారం గ్రామం సమీపంలో 220కెవి విద్యుత్ స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అది సరిపోకుంటే అవసరమైతే పాల్వంచ నూతన ప్రాజక్ట్ నుంచి కూడా విద్యుత్ తీసుకోవచ్చనే అంచనాతో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. వామపక్షాలు ఉద్యమాలు చేశాయంటే అర్ధం ఉందని, కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నప్పుడు ఏంచేశారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం బయ్యారం ఉక్కు పరిశ్రమ సాకుతో డ్రామాలు ఆడుతోందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం పరిశ్రమ సాధిస్తామనే ధీమాతో ఉందని రవీందర్‌రావు అన్నారు.
కాంగ్రెస్ అధికారంలో బ్రదర్ అనిల్‌కు బయ్యారం ఉక్కు ఖనిజం తరలించేందుకు అనుమతులు ఇచ్చింది నిజంకాదా అని ప్రశ్నించారు. జిల్లా ప్రజలు బయ్యారం ఉక్కు పరిశ్రమపై ఆందోళన వద్దని కీలక పరిశ్రమను సాధించి తీరతామని, కేంద్రాన్ని ఒప్పించి, పరిశ్రమ రప్పించేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని అలా కాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ ఏర్పాటుకు పునరాలోచిస్తుందని ఆయన అన్నారు. అఖిలపక్షం ఆందోళనలు చేయడం అర్ధ రహితమని, మహబూబాబాద్ జిల్లా బంద్‌ను విరమించుకోవాలని, అఖిలపక్షాన్ని ప్రభుత్వం దగ్గరకు చర్చకు తీసుకువెళ్ళడానికి తాను సిద్దంగా ఉన్నట్లు రవీందర్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో మానుకోట మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ జర్రిపోతుల వెంకన్నగౌడ్, మార్కెట్ డైరెక్టర్ మంగళంపల్లి ఖన్నా, బయ్యారం మండలపార్టీ అధ్యక్షులు మధుకర్‌రెడ్డి, నాయకులు కొండపల్లి కరుణాకర్‌రెడ్డి, కుర్మ మురళి, యాకయ్య, గునిగంటి కమలాకర్, బాసికాల అంబరీష, మంగళంపల్లి రాజులు పాల్గొన్నారు.

Comments

comments