Home తాజా వార్తలు సరికొత్త రికార్డు

సరికొత్త రికార్డు

TRS is huge majority in Medak parliamentary constituency

 

ప్రత్యర్థిపై సుమారు 3 లక్షల పైచిలుకు ఆధిక్యం
ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ హరీశ్ ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్ : మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలిచింది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తనకు అప్పగించిన సమర్థవంతంగా నిర్వర్తించారు. భారీ మెజార్టీతో గెలిపిస్తానని కెసిఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారం 3 లక్షలకు పైగా మెజార్టీతో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి గాలి అనిల్ కుమార్ పై 3 లక్షలకు పైగా మెజార్టీతో ప్రభాకర్ రెడ్డి గెలుపొందాడు. మొత్తం పోలైన ఓట్లలో కొత్త ప్రభాకర్‌రెడ్డికి 5,72,321 ఓట్లు రాగా, గాలి అనిల్‌కుమార్‌కు 2,63,428 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి రఘునందరావుకు 1,92,048 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా హరీష్‌రావు కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అఖండ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో ప్రజలు కెసిఆర్ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని మరోసారి ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అపూర్వ విజయం సాధించిన జగన్‌కు అభినందనలు
ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన వైసిపి అధినేత జగన్‌కు టిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ప్రజలు పెట్టుకున్న విశ్వాసంతో పనిచేసి ముఖ్యమంత్రి పదవికే వన్నె తీసుకరావాలని ఆయన ఆకాంక్షించారు. మీ హయంలో ఏపి రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మంచి స్నేహ సంబందాలను కొనసాగిస్తూ అభివృద్ధిలో పరస్పరం పోటీపడాలని విదేశాల్లో ఉన్న హరీశ్‌రావు తన ట్విట్టర్ ద్వారా కోరుకుంటున్నట్లు తెలిపారు.

TRS is huge majority in Medak parliamentary constituency