Home తాజా వార్తలు తెలంగాణలో కారు జోరు

తెలంగాణలో కారు జోరు

TRSహైదరాబాద్ :  లోక్‌సభ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో భాగంగా తెలంగాణలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళుతోంది.  టిఆర్ఎస్ అభ్యర్థులు  తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ (సికింద్రాబాద్‌), బూర నర్సయ్యగౌడ్‌(భువనగిరి), పసునూరి దయాకర్‌ (వరంగల్‌), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), నామా నాగేశ్వరరావు (ఖమ్మం), నేతకాని వెంకటేశ్‌ (పెద్దపల్లి),  కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌),  గోడం నగేశ్‌(ఆదిలాబాద్‌) ముందంజలో ఉన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్(బిజెపి)‌, ఆదిలాబాద్‌లో సోయం బాపూరావు(బిజెపి) చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్‌), హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఒవైసీ(ఎంఐఎం) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

TRS Lead in Lok Sabha Election Results in Telangana