Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

త్వరలో పదవుల పందేరం?

TRS leaders are happy with the statement of the MP

ఎంపి కవిత ప్రకటనతో టిఆర్‌ఎస్ నేతల్లో ఆనందం

మనతెలంగాణ/నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఖాళీ గా ఉన్న నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ కానున్నట్లు తెలుస్తోంది. జిల్లా గ్రంథాలయంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎంపి కల్వకుంట్ల కవిత చేసిన ప్రకటనతో నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేయనున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో గత కొంత కాలంగా పదవులపై ఆశలు పెంచుకున్న నేతల్లో ఆనందం కనిపిస్తోంది. నిజానికి పార్టీ ఆవిర్భావం నుండి టిఆర్‌ఎస్‌జెండా మోసిన నేత లు ఈ సారి తమను ఎంపీ గుర్తిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2001లో టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు అయిననాటి నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న నేతలతో పాటు అనంతరం పార్టీలో చేరిన నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. పలుమార్లు కొందరికి కౌన్సిలర్లుగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు తదితర  పదవులకు పోటీ చేసే అవకాశం దక్కింది. మరికొందరికి అటు గ్రామీణ ప్రాంతాల్లోను ఇటు పట్టణంలోను ఎలాంటి అవకాశాలు దక్కలేదు. ఉద్యమ పార్టీ కావడంతో పాటు పార్టీ అధికారంలో లేకపోవడంతో పార్టీ బాధ్యతల్లోనే మునిగితేలారు. కెసిఆర్  ఆమరణ దీక్ష చేసిన సమయంలో  ఉద్యమించిన నేతలు  రాష్ట్ర ఏర్పాటుతో ఆశల పల్లకిలో ఊరేగారు. పార్టీ 2014లో అనూహ్యవి జయంతో అధికారంలోకి రాగా అప్పటికే పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి. ఈ పరిణామాలతో పార్టీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా కొందరికే  పదవులు దక్కాయి. ప్రభుత్వం ఉందన్న ధీమాతో టిఆర్‌ఎస్ నేతలు అధినేతల వైపు చూస్తు కాలాన్ని నెటుకొస్తున్నారు. ఇప్పటికే దాదాపు నాలుగేళ్ల కాలం గడిచిపోగా పలు పదవుల పంపిణీ జరగలేదు. దీంతో ఆ పదవులు తమవేనన్న ధీమా వారిలో కనిపించినా అధినేతల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ దశలో ఎంపీ కవిత చేసిన ప్రకటన వారిలో ఆశలను చిగురింపచేసినట్లైంది. రాష్ట్రస్థాయిలో పదవులు అటు ఉంచితే జిల్లాలో జిల్లా గ్రంథాలయ సంస్థతో పాటుగా నూతనంగా ఏర్పాటు చేసిన నూడా చైర్మన్ పదవులు, పాలకవర్గ పదవులు ఇంకా ఎవరికి కేటాయించలేదు. త్వరలో ఆ రెండు పదవులకు చైర్మన్‌లను, పాలక వర్గాలను నియమించనున్నట్లు తెలుస్తోంది. నూడా పరిధికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గంగారెడ్డితో పాటు పార్టీలో మొదటి నుండి క్రియాశీలకంగా పనిచేసిన  సుజిత్‌సింగ్‌ఠాకూర్, ప్రభాకర్‌రెడ్డి తదితర పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి తెరాసలో చేరిన నేత కాగా మంత్రి పోచారం, ఎంపీ కవిత ఆశీస్సులపై భరోసాతో ఉన్నారు. తన పెద్దరికానికి, ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం చేసిన కృషి మేరకు తనకు పదవి దక్కుతుందని ధీమాతో ఉన్నారు. మరోవైపు ఉద్యమ సమయంలో తనతో పాటు తన భార్య పడ్డపాట్లు, పార్టీ పట్ల

Comments

comments