ఎంఎల్ఎ చిన్నారెడ్డి అభివృద్ధే కనిపిస్తుంది
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కిరణ్‌కుమార్
మన తెలంగాణ/వనపర్తి : టిఆర్ఎస్ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉ న్నా వనపర్తి జిల్లా కేంద్రంలో తక్షణమే రోడ్ల విస్తరణ పనులను చేపట్టాలని కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు కిరణ్‌కుమార్ అన్నారు. సోమ వారం డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ముఖ్యమంత్రి తర్వాత అంతటి నాయకులు అంటూ కెసిఆర్ తనయుడు కెటిఆర్‌ను వనపర్తికి తీసుకొచ్చి రోడ్ల విస్తరణకు కొబ్బరికాయ కొట్టి మూడు నెలలు కావస్తున్నా పనులు ఏ మాత్రం ముందుకు సాగడం లేదని ఆయన అన్నారు. ప్రజలను మభ్యపెట్టేవిధంగా టిఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని 772 జిఒ విడుదలై ఏడాది కావస్తున్న అందుకు తగిన అభివృద్ధి మాత్రం జరుగడంలేదని కెటిఆర్ వచ్చినప్పటికి రోడ్ల విస్తరణకు తక్షణమే రూ. 50 కోట్లు కేటాయిస్తున్నట్లు బహిరంగ సభలో ప్రకటించినప్పటికి ఒక్క అడుగు కూడా ముం దుకు పడడం లేదని ఆయన అన్నారు. గత 38 ఏళ్ల కాలంలో నియోజక వర్గంలో ఎంఎల్ఎ చిన్నారెడ్డి, మాజి ఎంఎల్ఎ రావుల చంద్రశేఖర్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని, గతంలో శంకర్గంజ్ను రోడ్ల విస్తరణలో చేపట్టి తర్వాత ఎందుకు రద్దు చేశారో ప్రజలకు వివరించాలన్నారు. గతంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రోడ్ల విస్తరణ బాధితులకు నిరంజన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణబాబు, నాయకులు రాధాకృష్ణ, వెంకటేశ్వర్‌రెడ్డి, మల్లేష్, మన్నెంకొండ తదితరులు పాల్గొన్నారు.