Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యతకు పాతర

చెరువులు నిండాలి…పంటలు పండాలి…పల్లెలు పచ్చగా కళకళలాడాలి…రైతులు చల్లంగా ఉండాలి….! మిషన్ కాకతీయ పథకం ఉద్దేశంతో పాటు లక్షం. కానీ దీనికి కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తున్నారు. జేబులు నింపుకొలాన్న కక్కుర్తితో చెరువు పనుల్లో నాణ్యతకు పాతరేస్తున్నారు. పది కాలాలపాటు పట్టిష్టంగా ఉండాల్సిన పనులను తూతూమంత్రంగా కానిస్తు చేతులు దులుపుకున్నారు.

Missiion-Kakatiya

జిన్నారంపారిశ్రామికవాడ : మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఉమ్మడి జిన్నారం మండలంలో చేసిన పనులలో నాణ్యతకు పాతర వేయడం వల్ల చెరువుల పనులు కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గుమ్మడిదల మండలంలో ఉన్న చెరువుల పనులల్లో నాణ్యతకు కాంట్రాక్టర్లు పాతరేస్తున్నారు. ఉమ్మడి జిన్నారం మండలంలో గుమ్మడిదల ఉన్న సమయంలో మొదటి విడత మిషన్ కాకతీయ పనులలో చెరువుకట్ట మరమ్మతులకు నిధులు మంజూరు కావడం జరిగింది. కాంట్రాక్టర్ నిర్లక్షం వల్ల చెరువు కట్టకు అప్పుడే పూర్తిగా పగుళ్లు వచ్చాయి.

గతంలో కురిసిన విధంగా భారీ వర్షాలు కురిస్తే చెరువు కట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అధికార పార్టీకి చెందిన వారే పనులు చేయడం వల్ల ఎవరు కూడ పట్టించుకోలేదు. చెరువుకట్ట మొదట్లో మంచిగా చేసినా చెరువు చివర్లో కట్టపైన పూర్తిగా పగుళ్లు వచ్చాయి. చెరువు కట్టపై నుండి మీటరు లోతు వరకు పగుళ్లు వచ్చాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల పనులు ముందుకు సాగాయి. ఈ విషయంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కాంట్రాక్టర్లు చేసిన పనులను చూసి సరిపెట్టుకుని చేతులు దులుపుకున్నారు. మంబాపూర్ పటేల్ చెరువు పనులు సైతం అంతంత మాత్రంగానే సాగాయి. అలుగుల పనులు సూచించిన తీరులో జరుగకపోవడం వల్ల కురిసిన వర్షానికి చుట్టపక్కల మట్టి కొట్టుకపోయింది.

కానరాని పర్యవేక్షణ : అధికారులు పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు సాగించారు. అధికారులు సైతం పనులను చూసీ చూడనట్లుగా వారికి అనుకులంగా బిల్లులు చేయడం జరిగింది. ఉన్నత స్థాయి అధికారులు చెరువులకు జరిగిన పనుల తీరును పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు.

చెరువు కట్ట విషయంలో నాణ్యత కరువు : గుమ్మడిదల ఎర్ర చెరువు కట్ట విషయంలో కాంట్రాక్టర్ పనులను సక్రమంగా చేయకపోవడం వల్ల చెరువు కట్టకు అప్పుడే పగుళ్లు వచ్చాయని కాంగ్రెస్, టిడిపి నాయకులు అరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పుట్టనర్సింగరావు, పడమటి మహిపాల్‌రెడ్డి ,టిడిపికి చెందిన రాములుగౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన నాయకులే పనులు చేయడం వల్ల పనులలో నాణ్యత పాటించకపోయిన అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌లే పనులలో నాణ్యత లేకుండా చేస్తే మిగితా వారి పరిస్థితి ఏమిటని పశ్నించారు. ఎర్ర చెరువులో నీరు ఉంటే గ్రామంలోని వ్యవసాయం, ఇండ్లకు సంబంధించిన బోర్లు నుండి నీరు సంవృద్ధిగా వస్తాయని తెలిపారు. అధికారులు తగు చర్యలు తీసుకుని కట్ట మరమ్మతులు తిరిగి చేపట్టలని డిమాండ్ చేశారు.

Comments

comments