Home పెద్దపల్లి పుట్ట మధుకు మతిభ్రమించింది..!

పుట్ట మధుకు మతిభ్రమించింది..!

Putta-Madhu

కమాన్‌పూర్ : తాను నిర్వహించిన సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన మంథని ఎంఎల్‌ఎ పుట్ట మధును సిఎం కెసిఆర్ మందలించడంతో, మతిభ్రమించి మాజీ మంతి శ్రీధర్‌బాబుపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండల కాంగ్రెస్ నాయకులు చల్లగోండ సంతోష్, కోల నర్సాగౌడ్‌లు విమర్శించారు. మంగళవారం కమాన్‌పూర్ ప్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

మంథని నియోజకవర్గంలో దుప్పుల వేట కేసు, మంథని ఉపసర్పంచ్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో పాటు మంథని మథూకర్ మీస్టరీ కేసుతో తనపై వస్తున్న ప్రజా వ్యతిరేఖతను జీర్ణించుకోలేక పుట్ట మధు శ్రీధర్‌బాబుపై నిందాలు, అబండాలు వేస్తున్నాని ఆరోపించారు. మధూకర్ మృతదేహనికి రీ పోస్టుమార్టం చేస్తే ఆత్మహత్యో, హత్యో తేలుతుందని, అప్పుడు ఈ కేసులో ఏవరు ఉన్నారో బయటపడుతుందన్నారు. ఈ విలేకరుల సమా వేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు జెమినిగౌడ్, మల్యాల మహేష్‌గౌడ్, లల్లూ, సానా సురేష్, పూర్ణ చందర్, సాజీద్, తదితరులు పాల్గొన్నారు.