Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మరో 20 ఏళ్లు కెసిఆరే సిఎం: శ్రీనివాస్‌గౌడ్

TRS MLA Srinivas Goud says KCR will be CM for another 20 Years to Telangana

హైదరాబాద్: మరో 20 సంవత్సరాలు సిఎంగా కెసిఆరే ఉంటారని మహబూబ్‌నగర్ ఎంఎల్ఎ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…  రాష్ట్రప్రభుత్వం బిసిలకు మేలు చేస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ ఓర్వలేకపోతోందన్నారు. కాంగ్రెస్ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల బతుకంతా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడమేనని ఆయన విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే ఓర్వలేకనే అక్రమ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బాటలోనే బిజెపి నేతలు కూడా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తిరిగి తమకు అధికారాన్ని తెచ్చిపెట్టం ఖాయమని శ్రీనివాస్‌గౌడ్ జోస్యం చెప్పారు.

Comments

comments