Home జగిత్యాల అభివృద్ధిని చూసి ఓటేయండి : ఎంఎల్ఎ విద్యాసాగర్ రావు

అభివృద్ధిని చూసి ఓటేయండి : ఎంఎల్ఎ విద్యాసాగర్ రావు

TRS MLA Vidyasagar Raoఇబ్రహీంపట్నం (జగిత్యాల) : గ్రామాల్లో చేసిన అభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్ అభ్యర్థులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఓటేసి బారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని అమ్మక్కపేట, డబ్బా, వర్షకొండ, కొమటికొండపూర్, ఎర్దండి, కొజన్‌కొత్తూర్, తిమ్మాపూర్, యామాపూర్, వేములకుర్తి, బర్థీపూర్, మూలరాంపూర్ గ్రామాల్లో ఆయా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ఆయన ప్రస్తావించారు. వచ్చే నెల నుంచి పెన్షన్ రెట్టింపుకానుందని పేర్కొన్నారు. కాళేశ్వర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందించి రైతుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు పనులు వేగవంతం జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీటిని ఇచ్చేందుకు పనులు ఈ నెలఖరులోపు పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లింగంపెల్లి గంగాధర్,సోమ ప్రభాకర్, మాజీ సర్పంచులు పుప్పాల నర్సయ్య, ఆరేల్ల రాజాగౌడ్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

TRS MLA Vidyasagar Rao Election Campaign