Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ సభ్యుల ప్రమాణస్వీకారం…

టిఆర్‌ఎస్ సభ్యుల ప్రమాణస్వీకారం…

TRS-Party-MPs

ఢిల్లీ: రాజ్యసభకు టిఆర్‌ఎస్ నుంచి కొత్తగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభలో బండ ప్రకాశ్ ముదిరాజ్, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ముగ్గురు తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ప్రారంభంకాగానే  చైర్మన్ వెంకయ్యనాయుడు వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్యసభలో బుధవారం ఉదయం కొత్త ఎన్నికైన 41 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణంస్వీకారం ముగిసిన అనంతరం ప్రత్యేక హోదా కోసం టిడిపి, కాంగ్రెస్, వైసిపి సభ్యులు, కావేరీ జలవివాదంపై  అన్నాడిఎంకె, డిఎంకె  సభ్యులు  ఆందోళన చేయడంతో సభను చైర్మన్ వెంకయ్యనాయుడు మధ్యాహ్నానికి వాయిదా వేశారు.