Search
Sunday 19 August 2018
  • :
  • :
Latest News

ప్రధాని మోడీని కలిసిన టిఆర్‌ఎస్ ఎంపిలు

TRS MPs meets PM Narendra Modi in Delhi

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీని టిఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపిలు శుక్రవారం కలిశారు. రక్షణ శాఖ భూముల బదలాయింపుపై వారు ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ జంటనగరాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం రక్షణ శాఖ భూములను ఇవ్వాలని టిఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరిలోని రక్షణ శాఖ భూమిని తమకు ఇస్తే, అక్కడ ఫ్లై ఓవర్ నిర్మిస్తామని, దీంతో 44వ నంబర్ జాతీయ రహదారి, ఒకటోనంబర్ రాష్ట్ర రహదారి అనుసంధానానికి అనువుగా ఉంటుందని ఎంపిలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ జలవనరులకు సంబంధించి జాతీయ ప్రాజెక్టును కేటాయించాలని, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించేందుకు బైసన్‌పోల్, జింఖానా మైదానాల్లో ఒకదానిని తమకు కేటాయించాలని వారు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

TRS MPs meets PM Narendra Modi in Delhi

Comments

comments