Home తాజా వార్తలు టిఆర్‌ఎస్‌కు పెరిగిన ఓటు బ్యాంకు

టిఆర్‌ఎస్‌కు పెరిగిన ఓటు బ్యాంకు

TRS party 34.9 percentage votes in last general election
2014 ఎన్నికల్లో 34.9 శాతం… ఇప్పుడు 41.3 శాతం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ తన ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి 34.9 శాతం ఓట్లు వచ్చాయి. అంటే 67.63 లక్షల ఓట్లు రాగా అదే ఈ ఎన్నికలకు వచ్చేసరికి 41.3 శాతం ఓట్లు వచ్చాయి. అంటే 76.94 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ కూడా తన ఓటు బ్యాంకును పెంచుకుంది. 2014లో రెండు సీట్లతో 24.7 శాతం ఓట్లు (47.56 లక్షలు) ఓట్లు రాగా 2019లో (54.92 లక్షల ఓట్లు) 29.48 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక 2014లో 10.5 శాతం ఓట్లు సాధించిన బిజెపి ఈసారి అనుహ్యంగా 19.5 శాతం ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. ఎంఐఎంకు 2.78 శాతం ఓట్లు పోలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో 69 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈసారి అది పెరిగిన విషయం తెలిసిందే. ఇక ఈసారి నోటాకు 1.09 శాతం ఓట్లు పడ్డాయి. ఇక 2018 డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కంటే టిఆర్‌ఎస్‌కు కొంత ఓట్లు తగ్గాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకోవడంతో పాటు 47.4 శాతం ఓట్లు సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు 28.7 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

TRS party 34.9 percentage votes in last general election