Home తాజా వార్తలు ఇందిరా అలీన విధానమే… టిఆర్‌ఎస్‌కు ఆదర్శం

ఇందిరా అలీన విధానమే… టిఆర్‌ఎస్‌కు ఆదర్శం

M-P-Vinod

హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని ఎంపి వినోద్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ మాది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేదేలేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఉరివేసేలా టిడిపి అవిశ్వాసం పెడితే ఎలా మద్దతిస్తామని ప్రశ్నించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అలీన విధానమే టిఆర్‌ఎస్‌కు ఆదర్శమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ గురించి ఏ కాంగ్రెస్ నేత మాట్లాడలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు తెలంగాణ కుట్రదారులు తమని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.