Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్రంలో తిరుగు లేని శక్తిగా టిఆర్‌ఎస్ : కెటిఆర్

ktr11

మన తెలంగాణ / సిరిసిల్ల :  తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా టిఆర్‌ఎస్ ఎదుగుతుందని అందరిని కలుపుకుపోవడమే లక్షంగా ముందుకు పోతున్నామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. మంగళవారం సిరిసిల్లలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు, ఇతర నాయకులు తెరాసలో చేరిన సందర్భంగా వారికి కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సిరిసిల్లను తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ వికాసం దిశగా నెంబర్‌వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. కొత్తవారు పార్టీలో చేరితే పాత నాయకులు కొత్తగా వచ్చిన వారు తమకు అడ్డుగా ఉంటారని భావించవద్దన్నారు. ఎవరి స్థానం వారికి ప్రజల్లో చిరస్థాయిగా ఉంటుందన్నారు. కొత్తగా చేరికలతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అభివృద్దిని స్వాగతిస్తున్నారని మళ్లీ ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ను చూడాలని కోరుకుంటున్నారన్నారు.

        ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సబ్బండవర్ణాల అభివృద్ది చేస్తున్నారని పేదవర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేరు వచ్చిందన్నారు. సిరిసిల్ల రాజకీయంగా తనకు జన్మనిచ్చిందని సిరిసిల్లను అగ్రశ్రేణి నియోజకవర్గంగా తీర్చిదిద్దేంత వరకు విశ్రమించనని అన్నారు. నాయకుల మధ్య వైరుధ్దాలు పెట్టుకోవద్దని అభివృద్ది కోసం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవసరాలకు అవసరమయ్యే గుడ్డను సిరిసిల్ల నేతన్నలతోనే తయారుచేయిస్తానని పునరుద్ఘాటించారు. నేతన్నలకు ప్రతి నెలా 15 – 20 వేల రూపాయల ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. కొందరు కావాలని విమర్శలు చేస్తున్నారని కళ్లుంటే అభివృద్ది కనిపిస్తుందని రాజకీయాలు పక్కకు పెట్టి అభివృద్దిలో కలిసి రావాలన్నారు.

           ఎన్నికల సమయంలో ప్రజలే జయాపజయాలు నిర్ణయిస్తారని అందరూ కలిసి అభివృద్దికి బాటలు వేయాలన్నారు. మంగళవారం మంత్రి సమక్షంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణగౌడ్, బిజెపి ఫ్లోర్ లీడర్ ఎర్రం వెంకట్రాజం, బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గడ్డం లత, టిడిపి ఫ్లోర్ లీడర్ దార్ల సందీప్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, మాల మహానాడు నాయకుడు రాగుల రాములు, మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండి సత్తార్ తోపాటు పలువురు నాయకులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతోపాటు పలువురు స్థానిక నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ నూతనభవనంలోకి మారిన కార్తికేయ ఆసుపత్రిని ప్రారంభించారు.

Comments

comments