Home తాజా వార్తలు నల్లగొండలో టిఆర్ఎస్ ముందంజ

నల్లగొండలో టిఆర్ఎస్ ముందంజ

 

హైదరాబాద్: వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక కోటా ఎంఎల్‌సి స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకున్నాయి. నల్లగొండ స్థానిక సంస్థల ఎంఎల్‌సిలో టిఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు టిఆర్ఎస్ కు 600 ఓట్లు పడ్డాయి. దీంతో చిన్నప రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం నల్లగొండలో 1072 ఓట్లు పోల్ కావడంతో అందులో 600 ఓట్లు టిఆర్ఎస్ కే పడడంతో గెలుపు లాంఛనమే, కానీ ఇంకా అధికారులు ప్రకటించలేదు. రంగారెడ్డి, వరంగల్ లో కూడా టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం.

 

TRS Party Lead in Nalgonda MLC Elections in Telangana