Home తాజా వార్తలు కారు జోరు.. ప్రతిపక్షాల బేజారు…!

కారు జోరు.. ప్రతిపక్షాల బేజారు…!

Trs party leaders Election Campaign

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కాగా, అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ మాత్రం ప్రతి ఓటరుకు అనుసంధానమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో కెసిఆర్ సర్కార్ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ… స్థానికులతో మమేకమవుతున్నారు పార్టీ నేతలు. స్వార్ధ రాజకీయాలు పదవి కాంక్షతో  కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ కలిసి పోటీ చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందున్న సంగతి తెలిసిందే. అయితే రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడానికి కెసిఆర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఇతర పార్టీ నేతలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. వారికి గులాబీ కండువాలు కప్పుతూ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న టిఆర్ఎస్… ప్రతిపక్ష పార్టీలకు చేమటలు పట్టిస్తోంది. వాడలు, బస్తీలు, కాలనీలను చుట్టేసి అన్ని వర్గాల మద్దతును కూడగడుతున్నారు. టికెట్ లు కేటాయించిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లు వారి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.