Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్ గతాన్ని గుర్తుపెట్టుకోవాలి

              CPI-Narayana

మన తెలంగాణ /హైదరాబాద్: తెలంగాణ ప్రజల సహనం నశిస్తే అగ్ని పర్వతం మాదిరిగా బద్దలవుతుందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. నిజాం పాలన నుంచి తెలంగాణ సాధన ఉద్యమం వరకు విభిన్న సందర్భాల్లో ఇది రుజువైందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం విమర్శలను సహించడం లేదని, గతాన్ని గుర్తుకు పెట్టుకోవాలని సూచించారు. అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు నిర్వహించతల పెట్టిన ‘సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సిపిఐ పోరుబాట’ పాటల సిడిని సుధాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. మఖ్ధుంభవన్‌లో మంగళ వా రం జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారా యణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ పాల్గొన్నారు. అనంతరం సురవరం మా ట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమం, నాటి తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొనని బిజెపి అపరాధ భావం నుంచి బైటపడేందుకు తెలంగాణ విమో చనను వారే సాధించినట్లు చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ స్వాతంత్ర సమరయోధులకు పెన్షన్ కూడా ఇవ్వకుండా బిజెపి తెలంగాణకు చేసిన అన్యాయం నుంచి తప్పించుకు నేందుకు విమోచన యాత్ర చేపట్టిందన్నారు. గౌరీ లంకేశ్ హత్యను ఐక్య రాజ్యసమితి సైతం ఖండించగా, ఇప్పటివరకు ప్రధాని మోడీ స్పందించ కపోవడం ద్వారా వారు ఏ పద్దతుల్లో ముందుకెళుతున్నారో అర్ధమవుతుం దన్నారు. నల్ల గొండలో పోటీ విషయంపై తొలుత వామపక్షాలు చర్చిం చుకుని నిర్ణయం తీసుకుంటామని సుధాకర్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధా నంగా చెప్పారు.

గత ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానంలో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని, గత మూడేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే పనులేవి ప్రభుత్వం చేయలేదన్నారు. డాక్టర్ నారాయణ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రభు త్వం ఎందుకు వెనుకాడుతుందో కారణాలను చెప్పాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తామంటున్న టిఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తించేందుకు నిరాకరిం చడం మోసపూరితమైందన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సమ స్యలపై ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టి ప్రజలకు భరోసా ఇవ్వడం పోరుబాట లక్షమన్నారు. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి కొత్త పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడు తున్నదన్నారు.

Comments

comments