Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ సీనియర్ నేత మృతి…

టిఆర్‌ఎస్ సీనియర్ నేత మృతి…

trs-leader-died

సికింద్రాబాద్: నారాయణ ఖేడ్‌కు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత అశోక్ షెట్కార్ గురువారం మృతిచెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. షెట్కార్ మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్‌రావు దవాఖానకు వెళ్లి ఆయన భౌతిక కాయాన్నిసందర్శించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అశోక్ కుటుంబాన్నిఅన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి హరీశ్ రావ్ భరోసా ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతను కోల్పోవడం తీరని లోటన్నారు.