Search
Tuesday 20 November 2018
  • :
  • :

జమిలి ఎన్నికలకు టిఆర్‌ఎస్ అనుకూలం..

MP-Vinod-Kumar

ఢిల్లీ: 2019 నుంచి జమిలి ఎన్నికలకు టిఆర్‌ఎస్ పార్టీ అనుకూలమని ఎంపి వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం జాతీయ న్యాయ కమిషన్‌ను వినోద్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి అంటే అందరూ ముందుస్తూ ఎన్నికలు అని అనుకుంటున్నారని, కాని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమని తెలియజేశారు. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటికిప్పుడే మొదలైంది కాదని, జమిలి ఎన్నికలపై 1986 నుంచి జాతీయ న్యాయ కమిషన్ చర్చిస్తోందని వెల్లడించారు. జమిలి ఎన్నికలంటే ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన కొత్త విధానం అనుకుంటున్నారని, మోడీ కంటే ముందు నుంచే ఈ అంశంపై చర్చ జరుగుతోందన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ ప్రయోజనాలను కమిషన్‌కు వివరించామని, ఈ విధానంతో ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల పాలన సుగమంగా సాగుతుందని పేర్కొన్నారు. పూర్తికాలం పాటు ప్రభుత్వాలు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

Comments

comments