Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

డిఎస్ పై వేటు ?

D-Srinivas

నిజామాబాద్: రాజ్యసభ ఎంపి డి.శ్రీనివాస్‌పై వేటుకు టిఆర్‌ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. డిఎస్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా నేతలు ఒక్కటయ్యారు. డిఎస్ వ్యవహారంపై ఎంపి కవిత క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. టిఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు డిఎస్ పాల్పడుతున్నారని టిఆర్‌ఎస్ కార్యకర్తలు అధిష్ఠానానికి తెలిపారు. డిఎస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ నిజామాబాద్ నేతలు తీర్మానం చేశారు. డిఎస్‌పై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్‌కు లేఖలు రాశారు. నిజామాబాద్ రూరల్, అర్బన్ ప్రాంతాలలో డిఎస్‌కు గ్రూపులు కట్టే అలవాటు ఉందని, పైరవీలు, అక్రమార్జనలకు అలవాటు పడిన డిఎస్ టిఆర్‌ఎస్‌లో ఇమడలేక పోతున్నారని వివరించారు. ఆయన స్వార్థ ప్రయోజనాలు నెరవేరకపోవడంతో కుట్రలకు తెరతీశారని, డిఎస్ నిజ స్వరూపాన్ని బయటపెడుతూ పార్టీ ద్రోహానికి పాల్పడుతున్నారని నేతలు మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌లో కొనసాగుతూ పచ్చి అవకాశవాదంతో డిఎస్ తన తనయుడిని బిజెపిలో ప్రవేశపెట్టారన్నారు. తనయుడు ఎదుగుదలను పెంచుతూ టిఆర్‌ఎస్ బలహీనపర్చేందుకు  ప్రయత్నాలు ముమ్మరం చేశారని పేర్కొన్నారు. కొడుకు ఎదుగుదల కోసం బిజెపి పెద్దల దగ్గర మోకరిల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీ పెద్దలతో డిఎస్ మంతనాలు జరిపారన్నారు. ఈ సమావేశానికి టిఆర్‌ఎస్ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు హాజరయ్యారు.

Comments

comments