వరంగల్: ప్రగతి నివేదన సభకు వస్తూ పెండ్యాల వద్ద బస్సు ఢీకొని టిఆర్ఎస్ కార్యకర్త భిక్షపతి దుర్మరణం చెందాడు. బాధితుడి కుటుంబాన్ని వరంగల్ మేయర్ నరేందర్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని తక్షణ సాయం కింద 25 వేల రూపాయలను మేయర్ నరేందర్ అందజేశారు. మృతిడి భార్యకు నగరపాలక సంస్థ పిహెచ్సిలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇద్దరు పిల్లల చదువు బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్నిఅన్ని విధాలుగా ఆదుకుంటానని స్పష్టం చేశారు.