Home తాజా వార్తలు తెలంగాణ ప్రగతివీణ

తెలంగాణ ప్రగతివీణ

TRS to hold public meeting tomorrow in kongarkalan

కొంగరకలాన్‌లో నేడే కనీవినీ ఎరుగని ప్రజా కొలువు

ప్రగతి నివేదన సభకు అనంతంగా తరలివస్తున్న ప్రజలు
లక్షపైగా వాహనాలు, స్వయంగా ట్రాక్టర్లు నడిపిన మంత్రులు
హరీశ్, పోచారం, జగదీశ్‌రెడ్డి
జన మహాసముద్రం కానున్న కొంగరకలాన్
జై తెలంగాణ, జై కెసిఆర్ నినాదాలతో ప్రతిధ్వనిస్తున్న ఊరు, వాడ,
రోడ్లు భారీ సభా ప్రాంగణం 3 కాప్టర్లలో సభకు మంత్రులు
1600 ఎకరాల్లో పార్కింగ్ వసతి, ఉద్యమ ఫొటోల ఎగ్జిబిషన్

మన తెలంగాణ/ హైదరాబాద్ : నాలుగున్నరేళ్ల ప్రభుత్వ ప్రగతిని వివరించడానికి టిఆర్‌ఎస్ నిర్వహిస్తున్న ‘ప్రగతి నివేదన’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు ట్రాక్టర్లు, బస్సులు, ఇతర వాహనాలలో కొంగరకలాన్‌కు చేరుకుంటున్నారు. రాష్ట్ర రహదారులన్నీ గులాబీమయం గా మారాయి. రాష్ట్రమంతటా పల్లె, పట్నం, వాడ, రోడ్డు అంతా జై తెలంగాణ, జై కెసిఆర్ నినాదాలతో మారుమోగుతున్నాయి. టిఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభకు తెలంగాణ పల్లె జనం పట్నం బాట పట్టింది. ఏ దారి చూసినా కొంగరకలాన్‌వైపే, ఎక్కడ చూసినా గులాబీ శ్రేణులే అన్నట్లుగా ఎడ్ల బండ్లు మొదలు కొని బస్సుల వరకు అన్ని రకాల వాహనాల్లో గులాబీ శ్రేణులు నగర శివారు ప్రాంతానికి చేరుకుంటున్నాయి. దాదాపు 25 లక్ష ల మందితో నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు అన్ని జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఇప్పటికే లక్షలాది మంది ట్రాక్టర్లు, బస్సు లు, వ్యాన్‌లలో బయలుదేరారు. ఆయా ప్రాంతాల మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు, ఇతర ప్రజా ప్రతినిధులు, టిఆర్‌ఎస్ ముఖ్యనాయకులు వారి శ్రేణులను వా హనాల్లో తరలించారు. వేల సంఖ్యలో ట్రాక్టర్లలో టిఆర్‌ఎస్ శ్రేణులు కొంగరకొలాన్‌కు ప్రయాణమయ్యాయి. ఇక ద్విచక్రవాహనాలు, బస్సులు, కార్లు, ఇతర వాహనాలు వీటికి అదనం.

1600 ఎకరాల్లో పార్కింగ్ వసతి : సుమారు 80 వేల నుంచి లక్ష వరకు వాహనాలు ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటాయని అం చ నా వేసిన పోలీసులు కొంగరకలాన్‌లో ఇరవై పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేశాయి. ఇందుకోసం 1600 ఎకరాలను సిద్ధం చేశాయి. ఔట ర్ రింగురోడ్డు మీదుగా సులభంగా చేరుకోవడం కోసం ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ఎటువైపు వెళ్ళాలో, పార్కింగ్ ఎక్కడ చేయాలో బోర్డులను ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత వచ్చిన ట్రాక్టర్లను అనుమతించేది లేదని స్పష్టం చేసిన పోలీసులు దూరంగానే వాటిని నిలిపివేసి ఇతర వాహనాల్లో సభకు రావడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
భారీ సభాప్రాంగణం : కొంగరకొలాన్ ప్రగతి నివేదన సభకు భారీ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 160 అడుగుల పొడ వు, 90 అడుగుల వెడల్పుతో సభాస్థలిని ఏర్పాటు చేయగా దీనిలో ముఖ్య నాయకులు కొలువుదీరే వేదికను 100/40 అడుగుల విస్తీర్ణంలో రూపొందించారు. వేదికపై నాయకులు కూర్చోవడానికి 300 కుర్చీలు ఏర్పాటుచేశారు. సభకు తరలి వచ్చే వాహనాలను నిలపడానికి ఇబ్బందులు కలగకుండా 1600 ఎకరాల్లో 22 పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేశారు. భారీ కటౌట్లు, గులాబీ జెండాలతో కొంగరకొలాన్ సభా ప్రాంగణం గులాబి గుబాళింపును పులుముకుంది. వేదికకు ఎదురుగా తొమ్మిది వరుసల చొప్పున రెండు విభాగాల్లో మొత్తం 18 వరుసల్లో (300 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పు) కుర్చీలను సిద్ధం చేశారు. దూరంగా కూర్చున్నవారికి సైతం వేదికమీద ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చూసేలా యాభై భారీ డిజిటల్ స్క్రీన్‌లను ఏర్పాటుచేశారు.

ఉద్యమ ఘట్టాలతో ఫోటో ఎగ్జిబిషన్ : తెలంగాణ ఉద్యమఘట్టాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సభా ప్రాంగణంలో శనివారం ఏర్పాటుచేశారు. 2001 నుంచి 2014 వరకు జరిగిన ముఖ్యమైన ఉద్యమ సందర్భాల ఫోటోలతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటోలతో కూడిన ఈ ఎగ్జిబిషన్‌ను పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్ ఏర్పాటుచేశారు. దీనిని మం త్రులు కెటి.రామారావు, మహేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డిలు శనివారమే ప్రారంభించారు.

ట్రాక్టర్లపై మంత్రులు : పలు జిల్లా కేంద్రాల నుంచి తరలుతున్న ట్రాక్టర్లను మంత్రులు జెండాఊపి ప్రారంభించడంతో పాటు స్వయం గా నడుపుకుంటూ వస్తున్నారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు తదితరులంతా స్వయంగా నడుపుకుంటూ వస్తున్నారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు రోజుల క్రితమే బయలుదేరారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 200 ట్రాక్టర్లలో దాదాపు 25 వేల మంది రైతులు, సూర్యాపేట నుంచి వందలాది ట్రాక్టర్లలో సుమారు 50 వేల మంది, బాన్సువాడ నుంచి 300 స్వంత వాహనాలు, 1500 ఇతర వాహనాలు, 200 బస్సులు, 1200 తుఫాను వాహనాల్లో దాదాపు 25 వేల మంది సభకు బయలుదేరారు. ఒక్క కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది సభకు హాజరవుతున్నట్లు అంచనా. ఈ జిల్లాల నుంచి ఉదయం వందకు పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించి సభకు ప యనమయ్యారు. జడ్జర్ల నుంచి 3 వేల బైక్‌లతో ర్యాలీగా సభకు బయలుదేరారు. వీరితో పాటు 300 క్రూజర్లు, 250 ట్రాక్టర్లు, 200 ఆర్టీసి బస్సులు,, 150 ప్రైవేటు బస్సులు నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఖమ్మం, సంగారెడ్డి, మెద క్, కరీంనగర్, భూపాలపల్లి, మహబూబ్‌నగర్ ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్య లో కొంగరకొలాన్‌కు పయనమయ్యారు. నిత్యవసరాలకు, అత్యవసరాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ట్రాక్టర్లను శనివారం అర్ధరాత్రి వరకే అనుమతించారు. ఆదివారం ట్రాక్టర్లను అనుమతించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ముందస్తంటే భయమెందుకు?

 విపక్షాలకు మంత్రి కెటిఆర్ చురక
ప్రగతి నివేదన సభకు తాము అధికార దుర్వినియోగానికి పాల్పడడం లేదని మంత్రి కెటిఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలతో సహా ఇతర విపక్షాల ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. ఏడు వేల బస్సుల కోసం రూ.11 కోట్లు చెల్లించామని చెప్పారు. ఇతర సేవల కోసం ఆయా ప్రభుత్వ శాఖలకు చెల్లింపులు చేశామని తెలిపారు. ‘ముందస్తు ’అంటే తాము భయపడాలి కాని విపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలకెందుకు భయమని కెటిఆర్ ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో టిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలకు దేశం మొత్తం అబ్బురపడుతోందన్నా రు. ఈ భయంతోనే కాంగ్రెస్ ముందస్తుగానే ఓటమి భయంతో అల్లాడిపోతోందన్నారు. అందుకే సభను అడ్డుకోవడానికి కోర్టునాశ్రయించడం వంటి దారులను ఎంచుకుందన్నారు. మంత్రు లు కెటిఆర్, మహేందర్‌రెడ్డి స్వయంగా కారు నడుపుతూ ప్రాంగణంలోని ఏర్పాట్లను పరిశీలించారు. యుద్ధం మొదలుకాకముందే కాంగ్రెస్ నేతలు అస్త్ర సన్యాసం చేశారని, ఐదున్నర దశాబ్దాల పాచిముఖాలకు ప్రజలు సమాధానం ఇప్పటికే చెప్పారన్నారు.