Home రాష్ట్ర వార్తలు శతాధికం

శతాధికం

  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్‌ఎస్‌కు 101-106 స్థానాలు
  • తాజా సర్వేలో వెల్లడైనట్టు టిర్‌ఎస్‌ఎల్‌పి సమావేశంలో సిఎం ప్రకటన

TRS-Polling

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే 101-106 స్థానాలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని  టిఆర్‌ఎస్ అధి నేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేయించిన సర్వేలో వెల్లడైంది. ఆరు నెలల క్రితం తొలిసారిగా సర్వే చేయించారు. తాజాగా ఫిబ్రవరిలో మరో సర్వే చేయించారు. ఎంఎల్‌ఏల పనితీరుపై ఈ సర్వేను నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన టిఆర్‌ఎస్ శాసనసభా సమావేశంలో సర్వే వివరాలను సిఎం కెసిఆర్ వెల్లడించారు. అనంతరం అవిభక్త జిలాల్ల వారీగా ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సి, ఎంపి లతో భేటీ అయి, నియోజకవర్గాల వారీగా ఎంఎల్‌ఏ ల పనితీరుపై సర్వే వివరాలు వివరించారు. విశ్వసనీ య సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి కెసిఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిచా రు. ఆయన నియోజకవర్గం గజ్వేల్‌లో 96.70 శాతం మంది ప్రజలు సిఎం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ 89.90 శాతంతో రెండవ స్థానంలో, బిజెఎల్‌పి నేత జి.కిషన్ రెడ్డి 84.70 శాతంతో మూడవస్థానంలో, మంత్రి హరీశ్‌రావు, ఎంఐఎం ఎంఎల్‌ఏ అహ్మద్ పాషా ఖాద్రీ ఇద్దరూ 82.30 శాతంతో నాలుగవ స్థానంలో నిలిచారు. నలుగురు మంత్రులకు 50 శాతం లోపు ప్రజాదరణ లభించగా, అందులో చందూలాల్ 34.40 శాతంతో అట్టడుగు స్థానంలో నిలిచారు. కాగా రంగారెడ్డి జిల్లాలో టిడిపి ఎంఎల్‌ఎ ఆర్.కృష్ణ య్య(ఎల్‌బినగర్) 24.40 శాతంతో చివరి స్థానంలో నిలిచారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య (స్టేషన్‌ఘన్ పూర్), నడింపల్లి దివాకర్‌రావు (మంచిర్యాల) 32.70 శాతంతో చివరిస్థానంలో నిలిచారు  ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి పట్ల ఆయన నియోజకవర్గంలో 63.20 శాతం మంది, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కు మార్‌రెడ్డిపై 53.70 శాతం మంది సానుకూ లంగా ఉన్నారు. టిడిపి ఎంఎల్‌ఏ ఎ.రేవంత్‌రెడ్డి (కొడంగల్) కి 49.80 శాతం, బిజెపి అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మ ణ్(ముషీరాబాద్)కు 43 శాతం, ఎంఐఎం శాసనస భాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ (చాంద్రాయ ణగుట్ట) కు 57.10 శాతం ప్రజాదరణ ఉన్నట్లు సర్వేలో తేలిం ది. కాంగ్రెస్ ఎంఎల్‌ఎల పనితీరు పట్ల వారి వారి నియోజకవర్గాల్లో చాలా మందికి 55 నుంచి 60 శాతంపైగా సంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో మొదటి, రెండు స్థానాల తరువాత ఉప ఎన్నికల్లో ఎన్నికైన ఎం.భూపాల్‌రెడ్డి (నారాయణ్‌ఖేఢ్) 81.50 శాతంతో మూడవస్థానంలో నిలిచారు. ఈ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎంఎల్‌ఏ డాక్టర్ జె.గీతారెడ్డి పనితీరు ను 62.30 శాతం మంది ప్రజలు మెచ్చుకోవడం విశేషం. ఆరు నెలల క్రితం  ఆమె పట్ల 36.8 శాతం మందే సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో బాబు మోహన్(ఆంధోల్) 44.90 శాతంతో చివరి స్థానం లో ఉన్నారు. నల్లగొండ జిల్లాలో భువనగిరి ఎంఎల్‌ఏ పైళ్ల శేఖర్‌రెడ్డికి అత్యధికంగా 81.90 శాతం, కోదా డ ఎంఎల్‌ఏ పద్మావతి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి అత్య ల్పంగా 31.80 శాతం మంది ప్రజలు ఆమోదం తెలి పారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి (సూర్యా పేట)కి 45.40 శాతం మంది మద్దతు తెలిపారు. ఆరు నెలల క్రితం ఇది 94.30 శాతంగా ఉంది. జిల్లాల్లో పద్మావతి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి(కోదాడ) మినహా మిగతా కాంగ్రెస్ ఎంఎల్‌ఏల పనితీరుపై సంతృప్తి వ్యక్తమైంది. జానారెడ్డి ఆరు నెలల్లో గణనీయంగా పుంజు కున్నారు. తొలుత 45.70 శాతం ఉండగా, తాజాగా అది 63.20 శాతానికి పెరిగింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు వారి నియోజకవర్గాల్లో 53.70 శాతం మంది ఆదరించారు. గ్యాదరి కిషోర్ కుమార్(తుంగతుర్తి)కి 35.80 శాతం, భాస్కర్‌రావు (మిర్యాల గూడెం)కి 34.70 శాతం మాత్రమే ఉన్నది.మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు లకా్ష్మరెడ్డి ప్రజాదరణ 73.20 శాతం నుండి 51.40 శాతా నికి, జూపల్లి కృష్ణారావుకు 62.50 శాతం నుండి 55.20 శాతానికి తగ్గింది. ఈ జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ ఎంఎల్‌ఏ ఎస్.ఎ.సంపత్ కుమార్(ఆలంపూర్)కు 71.10 శాతం లభించగా, కాంగ్రెస్ సీనియర్ ఎంఎల్‌ఏలు డి.కె.అరుణ(గద్వాల)కు 65 శాతం, చిన్నారెడ్డి(వనపర్తి)కి 57.70 శాతం, వంశీచంద్‌రెడ్డి(కల్వకుర్తి)కి 54.60 శాతం దిక్కింది. హైదరాబాద్ నగరంలో మంత్రులు టి.పద్మారావుకు 61.50 శాతం, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు 57.50 శాతం ఆదరణ లభించింది. అగ్రస్థానంలో బిజెఎల్‌పి నేత కిషన్‌రెడ్డి ఉండగా, చార్మినార్ ఎంఎల్‌ఏ అహ్మద్ పాషా ఖాద్రీ(చార్మినార్) 82.30 శాతంతో ద్వితీయస్థానంలో ఉన్నారు. బిజెపికి చెందిన చింతల రామచంద్రారెడ్డి(ఖైరతాబాద్) 34.80 శాతంతో చివరి స్థానంలో ఉన్నారు.వరంగల్ జిల్లాలో అత్యధి కంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు(పాలకుర్తి)కి 71.4 0 శాతం మంది, తరువాత టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ దాస్యం వినయ్ భాస్కర్(వరంగల్ వెస్ట్) కు అత్యధికంగా 70.50శాతం మద్దతు లభించగా , కాంగ్రెస్ ఎంఎల్‌ఏ దొంతిరెడ్డి మాధవరెడ్డి(నర్సంపేట)26.50 శాతంతో చివరి స్థానంలో నిలిచారు. స్పీకర్ మదుసూదనాచారి(భూపాలపల్లి)కి 50.20 శాతం, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(జనగామ)50.50 శాతం లభించింది. ఆదిలా బాద్ జిల్లాలో మంత్రులకు ప్రజాదరణ గణనీయంగా తగ్గింది. జోగు రామన్నకు 67.50 శాతం నుండి 39.90 శాతం, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డికి 96శాతం నుండి 58.40 శాతం పడిపోయింది. ఈ జిల్లాలో కోనేరు కోణప్ప(సిర్పూర్) 70.90 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, నడింపల్లి దివాకర్‌రావు(మంచిర్యాల)32.70 శాతంతో చివరిస్థానంలో నిలి చారు. ఇక్కడ కోవా లక్ష్మి(ఆసిఫాబాద్) గణనీయంగా పుంచుకొని ఆదరణను 17.10 శాతం నుండి 62.90 శాతం పెంచుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ) పనితీరుపై 69.30 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ జిల్లాలో బిగాల గణేష్‌గుప్తా(నిజామాబాద్ అర్బన్) 74.70 శాతంతో నెంబర్ వన్ స్థానంలో, షకీల్ అహ్మద్(బోధన్)39.40 శాతంతో చివరి స్థానంలో నిలిచారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి కెటిఆర్ పనితీరు పట్ల 60.40 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, ఆరు నెలల క్రితం ఇది 70.60 శాతంగా ఉంది. ఈ జిల్లాలో మంత్రి ఈటల రాజేందర్ తరువాత సిఎల్‌పి ఉప నేత జీవన్‌రెడ్డి(జగిత్యాల) 68.90 శాతంతో రెండవస్థానం లో నిలిచారు. ఇక్కడ చెన్నమనేని రమేశ్(వేములవాడ) 39.10 శాతం తో చివరి స్థానంలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వ ర్‌రావు(పాలేరు)కు నియోజకవర్గంలో 57.50 మంది సానుకూలంగా ఉన్నారు. గత సర్వేలో ఇది 82.10 శాతంగా ఉంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కకు (మధిర)లో 57.50 శాతం ప్రజల ఆదరణ ఉంది. జిల్లాలో అత్యధికంగా తాటి వెంకటేశ్వర్లు(అశ్వరావు పేట)కు 63.60 శాతం రాగా, అత్యల్పంగా టిడిపికి చెందిన సండ్ర వెంకటవీరయ్య(సత్తుపల్లి)కి 41.20 శాతం లభించింది. సిపిఐ(ఎం) ఎంఎల్‌ఏ రాజయ్య (భద్రాచలం)కు 54.80 శాతం ప్రజాదరణ లభించింది. రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేందర్‌రెడ్డి 38.30 శాతం మాత్రమే ప్రజాధరణ ఉన్నది. ఇక్కడ తీగల కృష్ణారెడ్డి(మహేశ్వరం) 72.30 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఏ టి.రామ్మోహన్‌రెడ్డి(పరిగి)కి 57.90శాతం ప్రజాదరణ లభించింది.